Sweden: సిగరెట్ పీకలను ఏరివేస్తున్న కాకులు.. ట్రైనింగ్ ఇచ్చిన కంపెనీ

Sweden: అర్థం కాకుండా నలుగురు అరుచుకుంటే ఏంటా కాకిగోల అంటారు.. మనుషుల్ని కాకులతో పోలుస్తూ తిడతారు కానీ పాపం మనకంటే అవే వెయ్యి రెట్లు బెటర్. అవును అక్షరాలా నిజం.. స్వీడన్ వీధులను శుభ్రం చేస్తున్న ఈ కాకుల గురించి తెలిస్తే అవాక్కవుతారు. పైగా వాటికి మనుషులే ట్రైనింగ్ ఇచ్చి మరీ శుభ్రం చేయిస్తు్న్నారు.. వంద సార్లు మనిషికి చెప్పడం కంటే ఒక్కసారి కాకికి చెప్పడం బెటర్ అని ఆ రూట్లో వెళుతోంది స్వీడన్ ప్రభుత్వం.
స్వీడన్‌లోని సోడెర్టాల్జేలోని ఒక స్టార్టప్ కంపెనీ కాకులకు ట్రైనింగ్ ఇచ్చింది. సిగరెట్ పీకలను తీసి బుద్ధిగా ఓ బుట్టలో వేస్తున్నాయి. ఇలా చేయడం వల్ల వాటికి ఫ్రీగా పుడ్డు అందిస్తున్నారు.
కాకులు జంతు రాజ్యంలో అత్యంత తెలివైన జీవులలో ఒకటి అని నిస్సందేహంగా చెప్పవచ్చు. అవి వైర్లు లేదా కొమ్మల నుండి హుక్డ్ టూల్స్ తయారు చేయగలవు. సమస్యను పరిష్కరించగలవు మరియు శరీర సంజ్ఞలతో ఒకదానికొకటి సందేశాలు పంపుతాయి.
ప్రతి సంవత్సరం దాదాపు 4.5 ట్రిలియన్ల సిగరెట్ పీకలు ప్రపంచంలోనే అత్యంత విస్తారమైన ప్లాస్టిక్ కాలుష్యం. ఈ గణాంకాలను దృష్టిలో ఉంచుకుని, స్వీడన్‌లోని ఒక స్టార్టప్ కంపెనీ అడవి కాకులకు వీధిలో కనిపించే సిగరెట్ పీకలను తీయడానికి శిక్షణ ఇచ్చింది. కాలుష్యాన్ని అరికట్టడంలో ఇది ప్రభావవంతమైన పద్ధతి అని అభిప్రాయపడుతోంది.
సిగరెట్లు భూమిపై అత్యంత చెత్తగా ఉన్న వస్తువులలో ఒకటి, అలాగే చెత్త యొక్క అత్యంత ప్రమాదకరమైన రూపాలలో ఒకటి. స్వీడన్‌లో, ప్రతి సంవత్సరం 1 బిలియన్ కంటే ఎక్కువ సిగరెట్ పీకలు వీధుల్లోకి విసిరివేయబడుతున్నాయి. దేశంలోని చెత్తలో 62 శాతం ఈ సిగరెట్ పీకలే ఉన్నాయి. ఒక్క సోడెర్టాల్జే నగరం వీధి క్లీనింగ్ కోసం దాదాపు 16కోట్ల రూపాయలు పైగా ఖర్చు చేస్తుంది.
కాకులు ఎందుకు?
కాకులు 7 నుండి 10 సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు ఉన్న తెలివితేటలతో సమానంగా వీటికి ఉంటాయి. పైగా పక్క వాటికి కూడా నేర్పిస్తాయి. కాకుల గురించి చాలా పరిశోధనల అనంతరం వాటికి శిక్షణ ఇచ్చి ఈ పనికి పురమాయించారు..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com