అత్యాచారం కేసులో ఆ ఒక్క కారణం చూపి శిక్ష తగ్గించిన న్యాయమూర్తి..!

అత్యాచారం కేసులో ఆ ఒక్క కారణం చూపి శిక్ష తగ్గించిన న్యాయమూర్తి..!
అత్యాచారం చేసిన వ్యక్తికి జైలు శిక్షను తగ్గిస్తూ ఓ న్యాయమూర్తి తీసుకున్న నిర్ణయం పైన నిరసన వెల్లువెత్తింది. ఈ ఘటన బెర్లిన్ లో చోటు చేసుకుంది.

అత్యాచారం చేసిన వ్యక్తికి జైలు శిక్షను తగ్గిస్తూ ఓ న్యాయమూర్తి తీసుకున్న నిర్ణయం పైన నిరసన వెల్లువెత్తింది. ఈ ఘటన బెర్లిన్ లో చోటు చేసుకుంది. గత ఏడాది ఫిబ్రవరి నెలలో ఓ నైట్ క్లబ్‌లో ఓ మహిళపై 33ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనితో అతనికి నాలుగేళ్ల మూడు నెలల జైలు శిక్ష పడింది. అయితే అతడు కోర్టుకు అప్పీల్ చేసుకున్నాడు. విచారణలో భాగంగా బెర్లిన్ కోర్టు అత్యాచారం కేవలం 11 నిమిషాలు మాత్రమే జరిగిందని, బాధితురాలకి తీవ్రంగా గాయపడలేదని పేర్కొంటూ దోషి శిక్షను మూడేళ్ళకి తగ్గిస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. దీనితో స్విస్ అప్పీల్ కోర్టు ముందు వందలాది మంది ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. న్యాయమూర్తి తీర్పును తీవ్రంగా ఖండిస్తున్నారు. "11 నిమిషాలు చాలా ఎక్కువ!" అంటూ నినాదాలు చేశారు.


Tags

Read MoreRead Less
Next Story