Sydney : గాల్లో ప్రాణాలు..

నడి సముద్రంపై ప్రయాణిస్తున్నప్పుడు విమానం ఇంజిన్లో సమస్య తలెత్తింది. పైలెట్ ఎమర్జెన్సీ హెచ్చరికలు జారీచేశాడు. 145 మంది ప్రయాణికులు ప్రాణాలు అరచేత్తో పట్టుకుని బిక్కు బిక్కుమంటు గడిపారు. చివరాఖరికి విమానం సురక్షింతంగా ల్యాడ్ అయింది.
న్యూజిల్యాండ్ అక్లాండ్ నుంచి సిడ్నీకి బయలు దేరిన క్వాంటస్ QF114 విమానం, పసిఫిక్ మహాసముద్రం గగనతలంలో ప్రయాణిస్తున్నప్పుడు ఇంజిన్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఇందులో 145 మంది ప్రయాణికులు ఉన్నారు. విమాన పైలెట్ 'మేడే' అలర్ట్ జారీ చేశారు. ఈ అలర్ట్ ను ప్రాణాంతకమైన పరిస్థితులలో మాత్రమే జారీ చేస్తారు. సిడ్నీకి చేరుకోబోయే 45 నిమిషాల ముందు అలర్ట్ జారీ అయింది. సిడ్నీ ఎయిర్ పోర్ట్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. ఆంబులెన్స్ లు, అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూటీం రన్ వే కు చేరుకున్నాయి. మరికాసేపట్లో విమానం ల్యాండ్ అవుతుందనగా ఎయిర్ పోర్టులో ఉద్విగ్న వాతావరణం నెలకొంది.
విమానం ల్యాండ్ అయ్యేందుకు అధికారులు అనుమతినిచ్చారు. ఇంజిన్ ఫెయిల్యూర్ తో ఉన్న విమానాన్ని కెప్టెన్ చాకచక్యంతో విజయవంతంగా ల్యాండ్ చేశారు. దీంతో ఎయిర్ పోర్టులో ఆనందం తాండవించింది. ప్రయాణీకులు, బంధువులు ఊపిరిపీల్చుకున్నారు. ఇది ట్విన్ ఇంజిన్ బోయింగ్ 737-800 మోడల్ విమానం కావడంతో ఒక ఇంజిన్ లో సమస్య తలెత్తినా మరొకర ఇంజిన్ తో సురక్షితంగా ల్యాండ్ చేశారు. టేకాఫ్ అవడానికి ముందు విమాన సమస్యను సరిగ్గా గుర్తించలేదని తెలుస్తోంది. టేకాఫ్ అయిన రెండుగంటల తర్వాత ఒక ఇంజిన్ లో సమస్య వచ్చినట్లు అధికారులు తెలిపారు. క్వాంటన్ విమాన సంస్థకు ప్రపంచంలోనే సురక్షితమైన విమాన సంస్థగా పేరుంది. 70 సంవత్సరాలుగా ఒక్క ప్రమాదానికి గురికాలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com