Taiwan-China: తైవాన్ గగనతలంలో చైనా విమానాలు

Taiwan-China: తైవాన్ గగనతలంలో చైనా విమానాలు
దుందుడుకు చర్యలకు పాల్పడుతున్న చైనా

స్వయంపాలిత ప్రాంతం అయిన తైవాన్‌ను తమ భూభాగంగా వాదించే చైనా మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడింది. దాదాపు 12 చైనా యుద్ధ విమానాలు, 6 నౌకలు తైవాన్ భూభాగం చుట్టూ కనపడ్డాయి. తైవాన్ జాతీయ రక్షణ శాఖ నుంచి అందిన వివరాల మేరకు తైవాన్ మీడియా ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపింది.

తైవాన్ పై చైనా తన యుద్ధాన్ని విరమించుకున్నట్టు లేదు. ఇప్పటికీ తైవాను ఆక్రమించుకోవడానికి చైనా రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. దాదాపు 12 చైనా యుద్ధ విమానాలు, 6 నౌకలు తైవాన్ యొక్క రక్షణ జోన్‌లోకి ప్రవేశించాయి. July 2, 3 తేదీల మధ్య మధ్య చైనా యుద్ధ విమానాలు, నౌకలు తిరిగినట్లు తైవాన్ గుర్తించింది. వెంటనే అప్రమత్తమైన తైవాన్ పలు చర్యలు తీసుకుంది. వీటిలో కొన్ని తైవాన్ జలసంధి మధ్యస్థ రేఖను దాటినట్టుగా తైవాన్ మీడియా చెప్పింది.

గత నెలలో మొత్తం కలిపి 318 యుద్ధ విమానాలు, 142 నౌకలను పంపింది. 2020 సెప్టెంబరు నుంచి తైవాన్ చుట్టూ చైనా ఇటువంటి చర్యలకు పాల్పడుతూనే ఉంది.తైవాన్ తమ భూభాగమే అని వాదిస్తూ దాన్ని స్వాధీనం చేసుకోవడానికి చైనా ప్రయత్నిస్తోంది. చైనా యుద్ధ విమానాలు తైవాన్ గగన తల రక్షణ ప్రాంతంలోకి ప్రవేశిస్తూ కలకలం రేపుతున్నాయి. సైనిక, రాజకీయ, ఆర్థిక పరంగా తైవాన్ పై ఒత్తిడి పెంచాలని చైనా కుట్రలు పన్నుతోంది. పైకి తమ యుద్ధ సామర్థ్యాలను పరీక్షించేందుకే తాము సైనిక విన్యాసాలు చేపడుతున్నట్లు చైనా చెప్పుకొస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story