Taiwan: స్వదేశీ జలాంతర్గామిని తయారుచేసిన తైవాన్

తైవాన్‌ను ఆక్రమించుకోవాలని కలలు కంటూ బ్లూప్రింట్‌ను విడుదల చేసిన చైనాకు భారీ షాక్ తగిలింది. దేశీయంగా తయారు చేసిన తొలి జలాంతర్గామిని తైవాన్ ఆవిష్కరించింది. పోర్టు సిటీ ఖోషింగ్‌లో ఈ జలాంతర్గామిని అధ్యక్షురాలు త్సాయ్ యింగ్ వెన్ ఆవిష్కరించారు. స్వదేశంలో తయారు చేసిన జలాంతర్గామిని ఆవిష్కరించడం గర్వంగా ఉందని తెలిపారు. గతంలో సొంతంగా జలాంతర్గామి నిర్మించడం అసాధ్యంగా ఉండేదని అన్నారు. కానీ, ఇప్పుడు దానిని సుసాధ్యం చేశామని వెల్లించారు. దాదాపు 1.54 బిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించిన ఈ డీజిల్ ఎలక్ట్రిక్ జలాంతర్గామి ఆ దేశ నౌకాదళం చేతికి 2024నాటికి అందుతుందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం అది పలు పరీక్షలు ఎదుర్కొనుందని తెలిపాయి. ఈ కొత్త సబ్‌మెరైన్‌కు హైకూగా నామకరణం చేశారు. కనీసం 10 జలాంతర్గాములను తమ నౌకాదళానికి అందించాలని తైవాన్ లక్ష్యంగా పెట్టుకొంది.
తరచూ నావికాదళాలతో తమ వైపు దూసుకొస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడే చైనాను అడ్డుకునేందుకు తైవాన్ తొలిసారిగా జలాంతర్గామిని తయారుచేసుకుంది. ప్రస్తుతం ఈ సబ్‌మెరైన్ పరీక్ష దశలో ఉంది. పరీక్షల్లో విజయవంతమై తైవాన్ అమ్ములపొదిలో చేరితే ఆ దేశ సైనిక స్థైర్యం మరింత ఇనుమడించనుంది. ‘గతంలో దేశీయంగా జలాంతర్గాముల తయారీ అనేది అసాధ్యం. కానీ ఈరోజు స్వదేశీ జలాంతర్గామి మీ కళ్ల ముందు ఉంది’ అని నౌకాతయారీకేంద్రంలో నూతన జలాంతర్గామి ఆవిష్కరణ కార్యక్రమంలో తైవాన్ అధ్యక్షురాలు త్సాయి ఇంగ్–వెన్ వ్యాఖ్యానించారు. కొత్త జలాంతర్గామికి హైకున్ అని పేరుపెట్టారు. చైనా ప్రాచీనగాథల్లో హైకు అంటే అద్వితీయులమైన శక్తులు గలది అని అర్ధం. హార్బర్, సముద్ర పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాక నావికాదళానికి అప్పగిస్తారు. 2027 ఏడాదికల్లా రెండు సబ్‌మెరైన్‌లను నిర్మించి దళాలకు ఇవ్వాలని తైవాన్ యోచిస్తోంది. తైవాన్ సమీప సముద్ర జలాల్లో తరచూ నేవీ, ఎయిర్‌ఫోర్స్ యుద్ధవిన్యాసాలు చేస్తూ ఉద్రిక్త పరిస్థితులను కల్పిస్తున్న చైనాకు ఈ పరిణామం గట్టిదెబ్బే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com