Taliban: ప్రజల సాక్షిగా.... చేతులు నరికేశారు....

రాక్షస పాలనకు పెట్టింది పేరైన తాలిబన్లు మరోసారి తమ కర్కసత్వాన్ని ప్రదర్శించుకున్నారు. దేశంలో క్రమంగా తమ మార్కు క్రూర పాలనను ప్రబలిస్తున్నారు. ఇదే కోవలో తాజాగా తొమ్మిది మంది చేతులు నరికేసి ప్రపంచం నివ్వెరపోయేలా చేశారు.
వివిధ నేరాలతో పాటూ, దొంగతనం చేసినందుకు శిక్షగా కందహార్ లోని ఫుట్ బాల్ స్టేడియంలో ప్రజలు చూస్తుండగానే తొమ్మిది మందికి చేతులు నరికేశారు. అక్కడితో ఆగకుండా తాలిబన్ ల రాక్షసత్వానికి పరాకాష్ఠగా దోషులకు 35 నుంచి 39 కొరడా దెబ్బలు కూడా వేసి తమ పైశాచికత్వాన్ని చాటుకున్నారు.
మైదానంలో తాలిబన్ అధికారులు, మతపెద్దలు, స్థానికులు ఈ ఉదంతాన్ని కన్నార్పకుండా చూస్తూనే ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు బయటకు రావడంతో అంతర్జాతీయంగా దీనిపై చర్చ మొదలైంది. ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ క్రూర పాలనపై మరోసారి రాద్ధాంతం జరిగేట్టు కనిపిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com