Afghanistan : అందానికి సంకెళ్లు

Afghanistan :  అందానికి సంకెళ్లు
ఆఫ్ఘనిస్తాన్‌లోని బ్యూటీ సెలూన్లు మూసివేయమన్న తాలిబాన్ల ఆదేశం

ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ చేతికి వచ్చినప్పటి నుంచి ఇక్కడ మహిళలు బాలికలు దిన దినం భయభ్రాంతులకు గురి అవుతూనే ఉన్నారు. మహిళల స్వేచ్ఛ అనే మాట పలకడం మరచిపోయారు.మహిళలకు విద్య ఉద్యోగం రెండు నిషేధించారు ఇప్పుడు తాజాగా ఒక నెలలోపు దేశంలోని అన్ని బ్యూటీ సెలూన్లను మూసేయానలి ఆదేశించింది తాలిబన్ ప్రభుత్వం.

ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం ఒక నెలలోపు బ్యూటీ సెలూన్లు మూసివేయాలని ఆదేశించింది. ఆఫ్ఘన్ మహిళలకు బహిరంగ ప్రదేశాలలో ప్రవేశాన్ని తగ్గించటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు నైతిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఆఫ్ఘన్ లో మహిళలు ఇళ్లకే పరిమితం అవ్వాలి. ఉద్యోగాలు చెయ్య కూడదు. యూనివర్సిటీ చదువు కాదు కదా, కనీసం హై స్కూల్ పూర్తి చేయాలన్న కష్టమే. మహిళల విద్యను తాలిబాన్లు నిషేధించారు. నిర్నీత దూరం దాటి వారు బయటకు వెళ్లాలన్నా భర్త లేదా ఇతర బంధువులు తోడుగా ఉండాలి. ఐక్యరాజ్యసమితి సంస్థల్లో కూడా మహిళలు పనిచేయొద్దని ఆదేశాలున్నాయి. జిమ్, పార్కులు, స్మిమ్మింగ్ పూల్స్ లో మహిళల ప్రవేశాన్ని నిషేధించారు. ధరించే దుస్తుల మీద కూడా ఆంక్షలు ఉన్నాయి. ఆఖరికి వారు వేసుకునే హజిబ్ రంగు ఎంపిక చేసుకునే స్వేచ్ఛ కూడా లేదు వారికి.





ఒకవేళ హక్కుల కోసం నినదించినా, వారిని తాలిబాన్ పోలీసులు చావబాదిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు తాలిబాన్ ప్రభుత్వం మరోసారి ఇలాంటి ఆదేశాలనే జారీ చేసింది.. ఆఫ్ఘన్ మహిళలకు బహిరంగ ప్రదేశాల్లో తిరగనివ్వకూడనే ఆలోచనలో భాగంగా మహిళల కోసం ఉన్న బ్యూటీ పార్లర్లను నెలలోపు మూసేయాలని ఆదేశాలు జారీ చేసింది.

2021లో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉపసంహరించుకోవడంతో, అక్కడి పౌర ప్రభుత్వాన్ని పడగొట్టి తాలిబాన్లు అధికారాన్ని చేపట్టారు. అప్పటి నుంచే అక్కడి ప్రజలు అనుభవిస్తున్న స్వేచ్ఛ కాస్త కాస్త గా హరించుకుపోతోంది. ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆఖరికి అక్కడి మహిళలకు స్వేచ్ఛగా కలలుకనే హక్కు కూడా లేదు.

Tags

Read MoreRead Less
Next Story