Taliban : తాలిబన్ల రాక్షస కాండ.. అండర్-19 వాలీబాల్ ప్లేయర్ తల నరికి ఊరేగింపు..

X
By - /TV5 Digital Team |21 Oct 2021 8:20 AM IST
Taliban : మహిళలు క్రీడలు ఆడొద్దని హెచ్చరించిన ముష్కరుల మాట వినని.. అండర్-19 వాలీబాల్ ప్లేయర్ మహ్జాబిన్ హకీమా బంధించి, చిత్రహింసలు చేసి తల నరికి వీధుల్లో ఊరేగించారు.
Taliban : అఫ్గానిస్తాన్ తాలిబన్లు తమ రాక్షస కాండను కొనసాగిస్తున్నారు. మహిళలు క్రీడలు ఆడొద్దని హెచ్చరించిన ముష్కరుల మాట వినని.. అండర్-19 వాలీబాల్ ప్లేయర్ మహ్జాబిన్ హకీమా బంధించి, చిత్రహింసలు చేసి తల నరికి వీధుల్లో ఊరేగించారు. తమ హెచ్చరికలను పట్టించుకోకుండా మహిళలు, అమ్మాయిలు ఎవరైనా ఆటలు ఆడాలని ప్రయత్నిస్తే, వారికి ఇదే గతి పడుతుందని హెచ్చరికలు జారీ చేశారు. ఈ విషయాన్ని అఫ్గాన్ అండర్19 వాలీబాల్ కోచ్ సురాయా ఆఫ్జాలీ చెప్పే వరకూ ప్రపంచానికి తెలియకపోవడం విశేషం. ఆఫ్ఘన్ జాతీయ మహిళా వాలీబాల్ జట్టు మొదట 1978 లో స్థాపించబడింది. అయితే, తాలిబాన్ పాలన తరువాత అంతర్యుద్ధం కారణంగా, జట్టు 1992 మరియు 2002 మధ్య తమ కార్యకలాపాలను నిలిపివేసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com