Afghanistan : స్వచ్ఛంద సంస్థల లైసెన్సులు రద్దు

Afghanistan : స్వచ్ఛంద సంస్థల లైసెన్సులు రద్దు
మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్న తాలిబన్ ప్రభుత్వం

అఫ్ఘానిస్థాన్ స్వాధీనం చేసుకున్న రోజు నుంచి తాలిబన్లు అక్కడ తమ రాక్షస పాలన ప్రారంభించారు. ఇస్లామిక్ చట్టాలు అంటూ తాలిబన్లు అఫ్గాన్ ప్రజలకు నిద్రలేకుండా చేస్తున్నారు. ప్రజలపై అంతులేని ఆంక్షలతో అణచివేస్తు చదవుకునే హక్కును ఆఖరికి జీవించే హక్కును కూడా కాలరాస్తున్నారు. ఇప్పుడు ప్రజా హక్కులకు భంగం కలిగించేలా మరో నిర్ణయం తీసుకున్నారు.

అఫ్ఘాన్ లో పనిచేస్తున్న 216 స్వచ్ఛంద సంస్థల లైసెన్సులను రద్దు చేశారు. స్వచ్ఛంద సంస్థలు తాలిబన్ల గైడ్ లైన్స్ పాటించడం లేదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్థిక శాఖ డిప్యూటీ మినిస్టర్ అబ్దుల్ లతీఫ్ నజారీ తెలిపారు. తాలిబన్ ప్రభుత్వం చేత నియమించబడిన ఈయన ఈ రద్దు శాశ్వతం కాదని, ప్రభుత్వం గైడ్ లైన్స్ పాటిస్తే వాటి లైసెన్స్ లను పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. ఈ నిర్ణయాన్ని అఫ్ఘాన్ పౌరులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. స్వచ్ఛంధ సంస్థలు అవసరాలలో ఉన్న అనేక మందికి చేయూతను అందించాయని వాటిని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.



నిజానికి పష్రూ బాషలో తాలిబన్ అంటే విద్యార్థులు అని అర్థం. అలాంటి విద్యార్థులు ఇప్పుడు ఈ రోజు అఫ్గానిస్తాన్ లో కరుడుకట్టిన ఉగ్రవాదులుగా మారిపోయారు. 1994లో అఫ్గానిస్తాన్ లోని కాందహార్ లో ముల్లా మోహమ్మద్ ఓమర్ మొదలు పెట్టినఈ తాలిబన్ సంస్థను తరువాత అఫ్గానిస్తాన్ లో అంతర్యుద్దం మొదలు పెట్టారు. తమ ప్రభాల్యం పెంచుకోవడానికి రాక్షసుల్లా మారిపోయారు. ప్రజాస్వామ్యాన్ని రూపుమాపి ఆయుధాలు చేత పెట్టి ఏకంగా ఎంతో మంది ప్రాణాలు తీసి అధికారాన్ని దక్కించుకున్న తాళిబన్ల ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత రోజు రోజుకు మరింత దిగజారిపోతున్నారు.

మొదట్లో మహిళల స్వేచ్ఛకు వ్యతిరేకం కాదని చెప్పిన తాలిబన్లు, ఆ తర్వాత మాత్రం తీసుకువచ్చిన నిబంధనలతో మహిళలను ఏకంగా బానిసలుగా మార్చేస్తున్నారు. మహిళలు ఒంటరిగా ఇంటి నుంచి బయటకు రాకూడదని, విధ్యాభ్యాసం చెయ్యకూడదని, బహిరంగ ప్రదేశాలలో తప్పకుండా హిజాబ్ ధరించాలి అంటూ నియమాలు జారీ చేశారు. అంతే కాదు ఇస్లాంలో నిషేధిత సేవలను బ్యూటీ పార్లర్లు అందిస్తూ ఉన్నాయిఅంటూ వాటిని ముసివేశారు. ఎదురు తిరిగిన వారిపై వీరు షారియా చట్టం ప్రకారం కఠిన శిక్షలు అమలు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story