Taliban : విదేశీ కరెన్సీపై నిషేధం విధించిన తాలిబన్లు ..!

Taliban :  విదేశీ కరెన్సీపై నిషేధం విధించిన తాలిబన్లు ..!
Taliban : తాలిబన్లు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశీ కరెన్సీ వాడకాన్ని నిషేధిస్తున్నట్టు ప్రకటించారు. దేశంలో వ్యాపారం కోసం విదేశీ కరెన్సీని వాడితే శిక్ష తప్పదని హెచ్చరించారు.

Taliban : తాలిబన్లు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశీ కరెన్సీ వాడకాన్ని నిషేధిస్తున్నట్టు ప్రకటించారు. దేశంలో వ్యాపారం కోసం విదేశీ కరెన్సీని వాడితే శిక్ష తప్పదని హెచ్చరించారు. దేశ ఆర్థిక స్థితిని దృష్టిలో పెట్టుకోవడంతోపాటు, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ప్రజలు సొంతదేశ కరెన్సీనే ఉపయోగించాల్సిన అవసరం ఉందని తాలిబన్ల అధికార ప్రతినిధి ప్రకటించారు.

తాలిబన్ల తాజా నిర్ణయంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతంతమాత్రంగా ఉన్న దేశ ఆర్థిక పరిస్థితిని ఈ నిర్ణయం మరింత ప్రభావితం చేస్తుందని అంటున్నారు. ఇప్పటికే దేశ కరెన్సీ విలువ దారుణంగా పడిపోయిందని, ఈ సమయంలో ఇలాంటి నిర్ణయాలతో ప్రజలు మరిన్ని ఇబ్బందుల్లో కూరుకుపోవడం ఖాయమని చెబుతున్నారు.

మరోవైపు దేశంలో విదేశీ మారక నిల్వలు ఇప్పటికే అడుగంటిపోయాయి. బ్యాంకుల్లోనూ తగినన్ని నిల్వలు లేవు. దేశంలో చాలా వరకు లావాదేవీలు అమెరికన్ డాలర్లలోనే జరుగుతుంటాయి. దేశ దక్షిణ సరిహద్దులో వ్యాపారం పాకిస్థానీ రూపాయల్లో జరుగుతుంది. ఇప్పుడు వీటిని నిషేధిస్తే పరిస్థితి ఏంటని వ్యాపారులు వాపోతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story