Taliban: పరాకాష్టకు చేరిన తాలిబన్ల అరాచకాలు..

Taliban: పరాకాష్టకు చేరిన తాలిబన్ల అరాచకాలు..
Taliban: అఫ్గనిస్తాన్‌ను ఆక్రమించుకుని అధికారంలోకి వచ్చిన తాలిబన్ల రాక్షస పాలన పరాకాష్టకు చేరింది.

Taliban: అఫ్గనిస్తాన్‌ను ఆక్రమించుకుని అధికారంలోకి వచ్చిన తాలిబన్ల రాక్షస పాలన పరాకాష్టకు చేరింది. ఇప్పటికే బహిరంగ మరణశిక్షలు, వ్యతిరేకించే వారిని వేటాడి చంపడం వంటి అకృత్యాలకు పాల్పడుతున్న తాలిబన్లు... తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. అఫ్గన్‌ సరిహద్దుల్లో ఆత్మాహుతి దళాలను మోహరిస్తున్నట్టు ప్రకటించింది. మరీ ముఖ్యంగా బదఖ్షన్ ప్రావిన్స్‌లో ప్రత్యేక ఆత్మాహుతి బెటాలియన్‌ను రంగంలోకి దింపినట్టు తెలిపింది.

బదఖ్షన్ ప్రావిన్స్ తజకిస్థాన్, చైనాతో సరిహద్దులు పంచుకుంటోంది. సూసైడ్ స్పెషల్ బెటాలియన్ ఏర్పాటు చేయనున్నట్టు ఆ ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ ముల్లా నిసార్ అహ్మద్ వెల్లడించాడు. ఈ బెటాలియన్‌కు లష్కర్-ఇ-మన్సూరిగా పేరు పెట్టినట్టు ప్రకటించాడు. ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వంలో భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకున్నట్టుగానే ఆత్మాహుతి దళాలు పని చేస్తాయని వెల్లడించాడు. ఈ బెటాలియన్ లేకపోతే అమెరికా ఓటమి సాధ్యమయ్యేది కాదని నిసార్ తెలిపాడు. బెటాలియన్ వ్యక్తులు పేలుడు పదార్థాలు నిండిన కోట్లు ధరిస్తారని పేర్కొన్నాడు.

Tags

Read MoreRead Less
Next Story