Taliban: తాలిబన్ల పాలన ఆటవికమా.. ఆధునికమా

న్(Afghanistan)లో ఆటవిక పాలన మొదలై రెండేళ్లు ముగిసిపోయింది( marks two years since return). ఈ సందర్భంగా తాలిబన్ పాలకులు సంబరాలు (second anniversary)చేసుకుంటుండగా... ప్రజలు మాత్రం బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. రెండేళ్ల క్రితం అప్గానిస్థాన్‌లో అధికారాన్ని తాలిబన్లు హస్తగతం(Taliban government) చేసుకున్నారు. ఆ సందర్భంలో కఠిన పాలనా విధానాలకు స్వస్తి చెప్పి ఆధునిక పాలనవైపు అడుగేస్తామని ప్రజలకు హామీనిచ్చారు. కానీ మళ్లీ తాలిబన్ల పాలన అరాచకం వైపే సాగింది. ఈ రెండేళ్లలో అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులు ఏం పెద్దగా మారలేదు.
తాలిబన్ల పాలనలో తమ జీవితాలెలా ఉంటాయో ఊహించుకుని భయపడ్డ అఫ్గాన్ల అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా అక్కడ అరాచక పాలన సాగుతోంది. 2021 ఆగస్టులో అధికారం చేపట్టే ముందు తాలిబన్లు తాము మారిపోయామనీ, 1996 నుంచి 2001లో లాగా పాలన సాగించబోమని పెద్దపెద్ద మాటలు చెప్పారు. కానీ అందుకు పూర్తి విరుద్ధంగా అఫ్గాన్ తాలిబన్ల ఆటవిక పాలన సాగుతోంది. బహిరంగ శిక్షలు, కఠినంగా షరియా చట్టాలు... కొరఢా దెబ్బలు ఇలా గత పాలనకు ఏ మాత్రం తీసిపోని విధంగా తాలిబన్ల పరిపాలన సాగుతోంది. రెండేళ్లయినా అఫ్గాన్‌లో పూర్తిస్థాయిలో శాంతి నెలకొనలేదు. అతివాద మిలిటెంటు గ్రూపులు అక్కడ ఇప్పటికీ దాడులు చేస్తూనే ఉన్నాయి.
సంప్రదాయ పాలన పేరుతో స్త్రీల వస్త్రధారణ, బ్యూటీ రంగాలపై తాలిబన్లు నిషేధం విధించడంతో చాలా వ్యాపారాలు తీవ్రంగా నష్టపోయాయి. దేశంలో ఈ రంగాలను నమ్ముకున్న లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. బ్యూటీపార్లర్లపై నిషేధంతో 60వేల మంది మహిళల జీవితాలు అగమ్యగోచరంగా తయారయ్యాయి. వ్యాపారరంగంతో పాటు మహిళా ఉద్యోగులను ఉద్యోగుల నుంచి తీసేశారు. ఏళ్లుగా చేస్తున్న ఉద్యోగాలు ఒక్కసారి ఊడిపోవడంతో స్త్రీలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు.
12 ఏళ్లు దాటిన బాలికలను పాఠశాలలకు దూరం చేశారు. మొదట్లో అఫ్గాన్ మహిళలు దీనికి వ్యతిరేకంగా ఉద్యమించినా..తాలిబన్లు దారుణంగా అణచివేశారు. సామూహికంగా కొరడాలతో కొట్టే కఠిన శిక్షలు విధించారు. ఈ రెండేళ్లలో కొన్ని నేరాలకు రాళ్లతో కొట్టడం వంటి శిక్షలను తాలిబన్లు సమర్థించినట్లు సమాచారం. ఇప్పుడు మహిళలు ఇంటి నుంచి కాళ్లు బయటపెట్టేందుకే భయపడుతున్నట్లు కథనాలు వెలుగు చూశాయి. ప్రజల పాప పుణ్యాలు లెక్కించేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాడింది.అరాచక పాలన చూసిన ఇతర దేశాలు.. అఫ్గాన్‌కు నిధులను నిలిపివేశాయి. మహిళలను పనులకు దూరం చేయడంతో అనేక స్వచ్ఛంద సంస్థలు అక్కడ కార్యకలాపాలను తగ్గించాయి. భద్రతాలేమితో పెట్టుబడులు రాక ఆర్థిక వ్యవస్థ కుదేలైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com