Talibans: తాలిబన్ల పైశాచికానందం.. సంగీత విద్వాంసుని పరికరాన్ని ధ్వంసం చేస్తూ..

Talibans: తాలిబన్ల పైశాచికానందం.. సంగీత విద్వాంసుని పరికరాన్ని ధ్వంసం చేస్తూ..
Talibans: సంగీత విద్వాంసుడు ఏడుస్తుంటే తాలిబన్లు సైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు.

Talibans: ఆఫ్ఘనిస్తాన్‌లోని సీనియర్ జర్నలిస్ట్ అబ్దుల్‌హాక్ ఒమెరి పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాలిబన్ ఉగ్రవాది తుపాకీని చూపుతూ సంగీతకారుడిని చూసి నవ్వుతున్న వీడియో రికార్డయింది.

కళ్ల ముందే కాలిపోతున్న జీవనోపాధిని చూసి ఆ వాయిద్యకారుడు కన్నీరుమున్నీరయ్యాడు. ఈ సంఘటన జ జైఅరుబ్ జిల్లా పక్టియా ప్రావిన్స్ ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగింది అని ఒమెరి ఒక ట్వీట్‌లో తెలిపారు.

తీవ్రవాద బృందం చేసిన ఈ చర్య సోషల్ మీడియాలో చాలా విమర్శలను ఎదుర్కొంది. సంగీతకారుడికి మద్ధతుగా సంఘీభావం తెలిపారు నెటిజన్లు. వాహనాల్లో సంగీతం వినడాన్ని తాలిబన్లు నిషేధించారు. వివాహా వేడుకలలో సంగీతానికి సంబంధించిన ప్రోగ్రాములను నిషేధించింది. పురుషులు, స్త్రీలు వేర్వేరు హాళ్లలో సంగీత కార్యక్రమాలను, మ్యూజికల్ ఈవెంట్స్‌ని జరుపుకోవాలని ఆదేశించింది.

ఆ మధ్య హెరాత్ ప్రావిన్స్‌లోని బట్టల దుకాణాలలో "మనెక్విన్స్" (షాపుల ముందు ఉంచిన బొమ్మలు) తలలు నరికివేయాలని తాలిబన్ ఆదేశించింది. కొందరు తాలిబన్లు అప్పటికే కాబూల్‌లోని దుకాణాలలో నిలబడి ఉన్న బొమ్మల తలలను పగలగొట్టడం మొదలుపెట్టేశారు.

తాలిబన్ల విధ్వంసకర చర్యలకు పరాకాష్టగా నిలుస్తోంది వారి ప్రవర్తన. తాము మళ్లీ అధికారంలోకి వస్తే 20 సంవత్సరాల క్రితం అమలు పరిచిన విధానాలను మార్చుకుంటామని ప్రకటించింది. కానీ చెప్పింది ఒకటి చేసేది ఒకటి. ఆఫ్ఘనిస్తాన్‌లో పెద్ద మార్పులు కనిపించడం లేదు. తాలిబన్ల అరాచకాలకు అంతేలేదన్న విషయం తాజా సంఘటన ద్వారా మరోసారి రుజువైంది.

Tags

Read MoreRead Less
Next Story