గర్భవతి అని కూడా చూడకుండా... తాలిబన్ల అరాచకం..!

గర్భవతి అని కూడా చూడకుండా... తాలిబన్ల అరాచకం..!
తాజాగా ఓ నిగారాఅనే మహిళా పోలీస్ ఆఫీసర్ ని అందులోనూ 6 నెలల గర్భవతిని ఆమె కుటుంబ సభ్యుల ముందే తుపాకీతో కాల్చి చంపేశారు.

తాము మారిపోయం అని చెప్పుకుంటున్న తాలిబాన్ల ఆసలు రూపం ఒక్కొక్కటిగా బయటపడుతుంది. తాజాగా ఓ నిగారాఅనే మహిళా పోలీస్ ఆఫీసర్ ని అందులోనూ 6 నెలల గర్భవతిని ఆమె కుటుంబ సభ్యుల ముందే తుపాకీతో కాల్చి చంపేశారు. ఈ ఘటన ఘోర్ ప్రావిన్సుల రాజధాని ఫిరోజ్కొ పట్టణంలో చోటుచేసుకుంది. ఇప్పటికే మహిళలు తమ భద్రతపై ఆందోళన చెందుతున్న క్రమంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం మరింత కలకలం సృష్టించింది. అయితే ఆమెను పాతకక్షాలు లేదా మరేదైనా కారణంతో చంపి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. బుర్ఖాలు లేకుండా కనిపిస్తే తాలిబాన్లు వేటాడతారని, కొడతారనే భయంతో మహిళలు ఇప్పటికే వాటిని కొనుగోలు చేయడం కూడా మొదలుపెట్టారు. తాజాగా ఈ హత్యతో గత ప్రభుత్వంలో పనిచేసి అధికారులు కూడా తాలిబన్లు అంటే భయపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story