అఫ్గానిస్థాన్: 'రెడ్‌లైన్' ఆగస్టు 31 ఏం జరగబోతోంది..

Taliban: తాలిబన్ల గుప్పిట్లోకి ఆఫ్గనిస్తాన్ వెళ్లిపోవడంతో అక్కడ భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇతర దేశాల పౌరుల తరలించే ప్రక్రియలో భాగంగా బలగాల ఉపసంహరన గడువు పెంచే అవకాశాలను పరిశీలిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ తెలిపారు. ఈ నేపథ్యంలో స్పందించిన తాలిబన్లు అమెరికాకు ఆగస్టు 31 వారికి 'రెడ్ లైన్' అని స్పష్టం చేశారు. గడువు ముగిసిన తర్వాత అమెరికా బలగాలు ఇంకా అఫ్గాన్‌లోనే ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అఫ్గాన్ నుంచి అమెరికా బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని అన్నారు.
ఈ నేపథ్యంలో బలగాల ఉపసంహరణ, తాలిబన్ల హెచ్చరికల నేపథ్యంలో ఆగస్టు 31న ఏం జరగబోతోందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం కాబుల్ ఎయిర్‌పోర్టు మాత్రం 6వేల మంది అమెరికా సైనికుల స్వాధీనంలో ఉంది. కాబుల్ ఎయిర్‌పోర్టు దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో తరలింపు ప్రక్రియ ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది.
అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా బలగాలు ఉపసంహరించుకున్న స్వల్ప సమయంలోనే తాలిబన్లు దేశం మొత్తాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. ఇతర దేశల సిబ్బంది, రాయబార కార్యాలల్లోని వారికి వారి స్వదేశాలను తరలించే ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది. ఇందులో భాగంగా అమెరికా కూడా వారి పౌరులతో పాటు మిత్ర దేశాల సిబ్బందిని తరలిస్తోంది. కాబుల్ ఎయిర్‌పోర్టు నుంచి ఇతర దేశాల పౌరులను తరలించే ప్రక్రియ సవాల్‌గా మారింది. ఈ ఆపరేషన్ పూర్తయ్యేవరకూ అఫ్గాన్ విడిచివెళ్లే ప్రసక్తే లేదని బైడెన్ ప్రకటించారు. అమెరికన్లను, మిత్రదేశాలకు చెందిన దాదాపు 65వేల మందిని తరలిస్తామని అభయమిచ్చే ప్రయత్నం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com