ఇద్దరమ్మాయిల ప్రేమ, పెళ్లి.. తమిళ బ్రాహ్మణ సాంప్రదాయంలో ఘనంగా వివాహం

ఇద్దరమ్మాయిల ప్రేమ, పెళ్లి.. తమిళ బ్రాహ్మణ సాంప్రదాయంలో ఘనంగా వివాహం
ఇద్దరమ్మాయిలు ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం ఈమధ్య కామన్ అయిపోతుంది. పెద్దలు కూడా వారి ప్రేమను అంగీకరిస్తున్నారు. అర్థం చేసుకుని ఆశీర్వదిస్తున్నారు..

ఇద్దరమ్మాయిలు ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం ఈమధ్య కామన్ అయిపోతుంది. పెద్దలు కూడా వారి ప్రేమను అంగీకరిస్తున్నారు. అర్థం చేసుకుని ఆశీర్వదిస్తున్నారు.. అమ్మాయి, అబ్బాయి స్నేహితులుగా ఉన్నామంటే ఒప్పుకోని సమాజం, ఇద్దరు అమ్మాయిల పెళ్లిళ్లను కూడా తప్పుపట్టేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. తమ బిడ్డ ఎదుగుతున్న క్రమంలో వచ్చే మార్పులను అర్థం చేసుకునే తల్లిదండ్రులు కొందరైతే చీత్కరించుకునే వారు మరికొందరు.. ఎల్‌జీబీటీ అని ఒక కమ్యూనిటీ ఏర్పడిన తరువాత ఇలాంటి వారికి కాస్త ఊరటగా మారింది.

తాజాగా పెళ్లి చేసుకున్న ఈ ఇద్దరు యువతుల్లో ఒకరు తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుభిక్ష కాగా.. మరొకరు బంగ్లాదేశ్‌కు చెందిన టీనా దాస్. తమిళనాడులోని చెన్నైలో వీరి వివాహం కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది.

సుభిక్ష తల్లిదండ్రులు కెనడాలోని కల్గేరీలో నివసిస్తున్నారు. అక్కడే బంగ్లాదేశ్‌కు చెందిన టీనా దాస్ పరిచయమైంది. ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నామని, పెద్దలను ఒప్పించడానికి ఇన్నేళ్లు పట్టిందని సుభిక్ష చెప్పారు. చార్టెడ్ అకౌంటెంట్‌గా పని చేస్తున్న సుభిక్ష బై సెక్సువల్.

సుభిక్ష తల్లి పూర్ణపుష్కల కల్గేరీలో ప్లే స్కూల్ నడుపుతున్నారు. కెనడా వెళ్లిన తరువాతే తమకు ఎల్‌జీబీటీ కమ్యూనిటీ గురించి తెలిసిందన్నారు. సుభిక్ష ప్రేమ విషయం తెలిస్తే బంధువులు, స్నేహితులు తమను ఎక్కడ దూరం పెడతారో అని చాలా భయపడినట్లు చెప్పారు.

తల్లిదండ్రులను మొదట తనని అర్థం చేసుకోలేదని, తనకు ఏదో వ్యాధి ఉందని భావించారని టీనా దాస్ పేర్కొన్నారు. పెళ్లయితే అన్నీ సర్థుకుంటాయని 19 ఏళ్ల వయసున్నప్పుడు ఒక వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. ఆ తర్వాత నాలుగేళ్లకు విడాకులు తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పుడు సుభిక్షను పెళ్లి చేసుకోవడం ఆనందంగా ఉందని వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story