మహా ముదురు సాలీడు.. పక్షిని గుటకాయ స్వాహ.. వీడియో వైరల్

మహా ముదురు సాలీడు.. పక్షిని గుటకాయ స్వాహ.. వీడియో వైరల్
సాధారణంగా సాలీడులు పక్షలను తినవు కానీ చాలా అరుదైన సందర్భాల్లోనే ఇలా జరుగుతుంటాయి

సాలీడు గూడు అల్లి చిన్న చిన్న పురుగులు దానిలో చిక్కుకుంటే వాటిని ఆహారంగా తీసుకుంటుందని తెలుసు.. కానీ ఇలా పక్షులనే గుటకాయ స్వాహా చేస్తుందని తెలియదు. పక్షులను తినేస్తుందంటే అది రాక్షస బల్లి టైప్‌లో రాక్షస సాలీడు అయి ఉంటుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఉన్న సాలీడు పక్షిని నోటకరిచింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సాలీడు. జర్మనీలోని లీబ్నిజ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఎవల్యూషన్ అండ్ బయోడైవర్శిటీ రీసెర్చ్‌లోని మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీకి చెందిన జాసన్ డన్‌లాప్ మాట్లాడుతూ.. సాధారణంగా సాలీడులు పక్షలను తినవు కానీ చాలా అరుదైన సందర్భాల్లోనే ఇలా జరుగుతుంటాయి అని వెల్లడించారు.

నేషనల్ జూ అండ్ కన్జర్వేషన్ బయాలజీ శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం వీడియోలో కనిపించే సాలీడు చెట్లలో నివసించే ఒక రకమైన టరాన్టులా అని నమ్ముతున్నారు. ఈ సాలీడు కాళ్ళ చివర కొంత పింక్ కలర్ ఉన్నందున వాటిని పింక్-టో టరాన్టులాస్ (సాలీడు) అని పిలుస్తారు. పింక్ కాలి టరాన్టులాస్‌లు బ్రెజిల్‌లో ఎక్కువగా కనిపిస్తాయి, ఎక్కువగా ఉత్తర దక్షిణ అమెరికాలోని వర్షారణ్యాలలో ఉంటాయి. అయితే అవి బల్లులు, కప్పలు, ఎలుకలు వంటి వాటిని వేటాడి తింటాయి అని తెలిపారు.

ఒక మహిళ తన ఇంటి వద్ద స్పైడర్ వెబ్‌లో చిక్కుకున్న పక్షిని తింటున్న భారీ సాలీడును గుర్తించింది. అన్నెట్ అలనిజ్ గుజార్డో పని మీద బయటకు వెళుతున్నప్పుడు తన ఇంటి వద్ద తోటలో ఉన్న సాలెపురుగు వెబ్‌లో చిక్కుకున్న పక్షిని చూశారు. అదే రోజు సాయంత్రం ఆమె ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, ఆ పక్షి చనిపోయినట్లు గుర్తించారు. అరుదుగా కనిపించే ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.

Tags

Read MoreRead Less
Next Story