అంతర్జాతీయం

Floyd's death: ఫ్లాయిడ్ ఘటన వీడియో తీసిన వ్యక్తికి 'ప్రతిష్టాత్మక' అవార్డ్..

నల్లజాతీయుడైన ఫ్లాయిడ్‌ని ఓ పోలీస్ అధికారి కిందపడేసి మెడపై మోకాలితో అదిమిపట్టాడు. ఆ ఘటన తర్వాత ఫ్లాయిడ్ మరణించాడు.

Floyds death: ఫ్లాయిడ్ ఘటన వీడియో తీసిన వ్యక్తికి ప్రతిష్టాత్మక అవార్డ్..
X

Floyd's death: కొన్ని దారుణాలు కళ్ల ముందే కనిపిస్తుంటాయి. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. కానీ ఆ అమ్మాయి తన జాతికి చెందిన ఓ వ్యక్తి ఎంతటి వివక్షకు గురవుతున్నాడో చూసి మిన్నకుండ లేకపోయింది. ఉబికి వస్తున్న దుఖాన్ని గుండెల్లోనే అదిమి పెట్టి ఫోన్ ద్వారా వీడియో తీసింది. ఆ వీడియోని ఓ న్యూస్ ఛానల్‌కి కూడా పంపించింది. మీడియాలో ప్రసారమైన ఆ వీడియోని చూసి ప్రపంచమంతా నివ్వెరపోయింది. నల్ల జాతీయులు ఇంకా వివక్షకు గురవుతూనే ఉన్నారని కలత చెందింది. వీడియో న్యూస్ ఛానల్స్‌లో ప్రసారమైన కొద్ది సేపటికే ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

నల్లజాతీయుడైన ఫ్లాయిడ్‌ని ఓ పోలీస్ అధికారి కిందపడేసి మెడపై మోకాలితో అదిమిపట్టాడు. ఆ ఘటనలో తర్వాత ఫ్లాయిడ్ మరణించాడు. ఫ్లాయిడ్ ను మోకాలితో అదిమిపట్టినప్పటి దృశ్యాలతో కూడిన వీడియో బాగా వైరల్ అయింది. 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్' అనే ఉద్యమానికి దారి తీసింది.

ఫ్లాయిడ్.. ఒక నల్లజాతీయుడు. మిన్నెసోటా పోలీసు అధికారి డెరెక్ చౌవిన్.. ఫ్లాయిడ్‌ని కారు కిందికి తోసి అతడి మెడపై కాలుతో అదిమి పెట్టాడు.. ఈ సంఘటన మే 25, 2020 న జరిగింది. ఈ దృశ్యాన్ని 17 ఏళ్ల ఫ్రేజియర్ చిత్రీకరించింది. వీడియోలో ఫ్లాయిడ్ "నేను ఊపిరి పీల్చుకోలేక పోతున్నాను" అని అరుస్తున్నాడు. దాదాపు 9 నిమిషాల 29 సెకన్ల పాటు చౌవిన్ ఫ్లాయిడ్ మెడపై నొక్కిపెట్టినట్లు ఉంది. ఈ సంఘటన పట్ల మొదట మిన్నెసోటాలో, తరువాత దేశవ్యాప్తంగా నిరసనలు రేకెత్తించింది.

ఉద్యమానికి దారితీసిన ఆ వీడియోను తీసిన ఫ్రేజియర్‌కు ఇప్పుడు ప్రతిష్ఠాత్మక 'పులిట్జర్ ప్రైజు (జర్నలిజం)' లభించింది. స్పెషల్ సైటేషన్ కింద ఫ్రేజియర్‌కు ఈ అవార్డును అందించారు. ఇక, ఆ వీడియోను ప్రసారం చేసిన 'ద స్టార్ ట్రిబ్యూన్' అనే చానెల్‌కు అవార్డు వరించింది.

వాస్తవానికి ఏప్రిల్ 19నే అవార్డులను ప్రకటించాల్సి ఉన్నా.. కోవిడ్ కారణంగా కార్యక్రమాన్ని వాయిదా వేశారు. 1917 నుంచి జర్నలిజంలో 'పులిట్జర్' ప్రైజులను అందజేస్తున్నారు. కాగా, ఇటీవలే మినియాపోలిస్ మేయర్.. ఫ్లాయిడ్ కుటుంబానికి పరిహారం చెల్లించడంతో పాటు నిందితుడైన పోలీస్ అధికారి డెరెక్ చావిన్ ను విధుల నుంచి తప్పించి అరెస్ట్ చేశారు.

Next Story

RELATED STORIES