యూట్యూబ్ వీడియో కోసం బ్రిడ్జి ఎక్కి స్టంట్ చేస్తూ.. 17 ఏళ్ల యువకుడు

యూట్యూబ్ వీడియో కోసం బ్రిడ్జి ఎక్కి స్టంట్ చేస్తూ.. 17 ఏళ్ల యువకుడు
X
కొత్తగా చేయాలనుకుంటున్నారు.. కోరి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

కొత్తగా చేయాలనుకుంటున్నారు.. కోరి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, వాటికి లైకులు, సబ్ స్క్రైబర్లు వస్తే ఆనందించడం.. ఈ క్రమంలో ప్రాణాలు ఫణంగా పెడుతున్నామన్న ధ్యాస కొంచెమైనా ఉండట్లేదు ఇలాంటి వారికి.

సోషల్ మీడియా స్టంట్ కోసం లాస్ ఏంజిల్స్‌లోని బ్రిడ్జి ఎక్కేందుకు ప్రయత్నించిన 17 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోపోయాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు మృతి చెందాడని పోలీసులు తెలిపారు.

ఈ సంఘటన శనివారం (మే 20) జరిగింది. ఆర్చ్‌పైకి ఎక్కుతూ టీనేజర్ పట్టుతప్పి పడిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినా ఉపయోగం లేకుండా పోయింది. అప్పటికే ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు నిర్ధారించారు.

వంతెనపై ఇలాంటి సంఘటనలు జరగడి ఇది మొదటిసారి కాదు.అంతకుముందు రేసింగ్‌లు, టేకోవర్‌లకు హాట్‌స్పాట్‌గా మారిన తర్వాత స్థానిక పోలీసులు చాలాసార్లు వంతెనను మూసివేశారు. ప్రమాదకరమైన ఈ విన్యాసాలు చూడటానికి వందలాది మంది ప్రేక్షకులు బ్రిడ్జి పైకి ఎక్కేవారు.

ఈ వంతెన గత జూలైలో ప్రారంభించబడింది. పర్యాటకులను ఆకర్షించేందుకు వేలకొద్దీ LED లైట్లు అమర్చారు.ఇది లాస్ ఏంజిల్స్ నదిపై 3,500 అడుగుల పొడవు వుంటుంది. ఈ వంతెన నగరంలో ఇప్పటివరకు నిర్మించిన అతిపెద్ద బ్రిడ్జిగా చెబుతారు.

Tags

Next Story