అమెరికాలోని ఫ్లోరిడాలో జెట్ స్కీ ప్రమాదం.. తెలంగాణ విద్యార్థి మృతి

ఇండియానా యూనివర్శిటీ పర్డ్యూ యూనివర్శిటీ ఇండియానాపోలిస్ (IUPUI)లో హెల్త్ ఇన్ఫర్మేటిక్స్‌లో మాస్టర్స్ చేస్తున్న తెలంగాణ విద్యార్ధి మృతి చెందాడు. కాజీపేటకు చెందిన వెంకటరమణ పిట్టల, మార్చి 9న ఫ్లోరిడాలోని విస్టేరియా ద్వీపం సమీపంలోని ఫ్యూరీ ప్లేగ్రౌండ్‌లో జరిగిన జెట్ స్కీ ప్రమాదంలో మరణించారు. రెండు జెట్ స్కీలు ఢీకొన్న ప్రమాదంలో అతడు అకాల మరణం చెందాడు. అయితే ఈ ప్రమాదంలో 14 ఏళ్ల బాలుడు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు.
27 ఏళ్ల వెంకటరమణ పిట్టల మేలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాల్సి ఉండగా.. మార్చి 9న ఫ్లోరిడాలో ఈ దుర్ఘటన జరిగింది. యుఎస్ వెళ్ళే ముందు, పిట్టల ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి ఫిజియోథెరపీలో బ్యాచిలర్ పూర్తి చేశాడు.
పిట్టల స్నేహితులు అతని కుటుంబాన్ని ఆదుకోవడానికి విరాళాలు కోరుతూ GoFundMe పేజీని ప్రారంభించారు. “ఈ క్లిష్ట సమయంలో, అతని అంత్యక్రియలు మరియు ఇతర ఖర్చుల కోసం అతని మృతదేహాన్ని అతని కుటుంబానికి పంపడానికి నిధులను సేకరించడానికి మేము అత్యవసరంగా మీ సహాయాన్ని కోరుతున్నాము అని పేజీ నిర్వాహకుడు బి సజన్ పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com