Tesla: ఎలాన్ మస్క్ తరువాత ఇతడే...

Tesla: ఎలాన్ మస్క్ తరువాత ఇతడే...
టెస్లాకు ఎలన్‌ మస్క్ తరువాత చైనీయుడే; మస్క్ తరువాత కీలక పదవీ బాధ్యతలు చేపట్టనున్న టామ్ ఝూ

ఎలక్ట్రిక్ కార్ల తయారి దిగ్గజం టెస్లాకు కొత్త బాస్ రెడీ అవుతున్నాడు. చైనాలోని టెస్లా ప్లాంట్ కు చీఫ్ గా వ్యవహరిస్తున్న టామ్ ఝూ పదోన్నతిపై సంస్థలోనే అత్యున్నత స్థానాన్ని అధిరోహించారు. ప్రస్తుతం ఎలాన్ మస్క్ తరువాత స్థానంలో టామ్ కుదురుకున్నారు. తాజా హోదాలో US అసెంబ్లీ ప్లాంట్‌లతో పాటు ఉత్తర అమెరికా, యూరప్‌లోని విక్రయాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించబోతున్నారు.

మరోవైపు గ్రేటర్ చైనాకు టెస్లా వైస్ ప్రెసిడెంట్ గా టామ్ ఝూ బాధ్యతలు కొనసాగించనున్నారు. దీంతో పాటూ టెస్లా ఆసియా సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌గానూ కొనసాగనున్నారు. దీంతో టెస్లా బాస్ ఎలోన్ మస్క్ తర్వాత కీలక పదవిలో టామ్ ఝూ కొనసాగనున్నారని తెలుస్తోంది. ప్రధాన మర్కెట్లలో, కీలక ఉత్పత్తి కేంద్రాల కార్యకలాపాలపై టామ్ దృష్టి సారించబోతున్నట్లు తెలుస్తోంది.


అమెరికాలో ఉత్పత్తి సమస్యలను పరిష్కరించడానికి గతేడాది చివర్లోనే ఝూతో పాటు అతని బృందాన్ని తీసుకువచ్చారు. అప్పుడే అతిడికి పెద్ద పదవే కట్టబెట్టబోతున్నారని సహ ఉద్యోగులు భావించారు. ట్విట్టర్ సీఈఓగా ఎలాన్ మస్క్ బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి టెస్లా వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించలేకపోతున్నాడన్న సంగతి తెలిసిందే. గ్లోబల్ రోల్ కోసం టామ్ ఝూ ఎంపిక కూడా ఈ నేపథ్యంలోనే జరిగిందని తెలుస్తోంది.


కోవిడ్ తో అతలాకుతలం అయిన సమయంలోనూ చైనాలో టెస్లా సేల్స్ ను గణనీయంగా పెంపొందిచిన ఘనత టామ్ ఝూకి ఉంది. ఆ సమయంలోనే సుమారు 405,278 కార్లును విక్రయించి వాల్ స్ట్రీట్ అంచనాలను తలకిందలు చేశారు. అప్పుడే టెస్లాకు నెక్స్ట్ బాస్ అయ్యే అర్హతను సంపాదించుకున్నాడు. మరి ఇదే ఊపులో టామ్ టెస్లాకు బిగ్ బాస్ అయినా ఆశ్చర్యపోనక్కరలేదు అంటున్నారు ట్రేడ్ పండిట్స్.

Tags

Read MoreRead Less
Next Story