బామ్మ @ 90.. మనవడితో పాటు మాస్టర్స్ డిగ్రీ

యూనివర్శిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ నుండి ఇంటర్ డిసిప్లినరీ స్టడీస్‌లో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసినందున, టెక్సాస్‌కు చెందిన 90 ఏళ్ల మిన్నీ పేన్ కు గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించుకుంది యూనివర్శిటీ.
"ఈ వయసులో నేనేం చేస్తాను.. ఈ పని నేను చేయలేను .. ఈ మాటలు నాకు అసలు నచ్చవు" అని మిన్నీ పేన్ అనే 90 ఏళ్ల వృద్ధురాలు చెప్పింది, ఆమె డిసెంబర్ 17న నార్త్ టెక్సాస్ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పట్టా పుచ్చుకుంది. ఈ వారం ఇంటర్ డిసిప్లినరీ స్టడీస్ మాస్టర్స్ లో పట్టభద్రురాలైంది.
73 సంవత్సరాల వయస్సులో టెక్సాస్ ఉమెన్స్ యూనివర్శిటీ నుండి 2006లో జనరల్ స్టడీస్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందింది. గ్రాడ్యుయేషన్ తర్వాత 16 సంవత్సరాలు కాపీ ఎడిటర్‌గా పనిచేసింది. ప్రస్తుతం హ్యూస్టన్ మ్యాగజైన్‌లో పని చేస్తోంది. అక్కడ వీలైనంత కాలం పని చేయాలని యోచిస్తోంది.
"నేను ఏడు గంటలకు నా డెస్క్‌లో ఉంటాను. ట్రాన్స్‌క్రిప్షనిస్ట్, వర్డ్ ప్రాసెసర్ గా పని చేస్తాను. ఉదయం 4:30కి లేచి, కాఫీ తాగుతాను, మా వీధిలో అరగంట వాకింగ్ చేస్తాను అని తనను పలకరించిన వారికి తన ఆరోగ్య రహస్యం వెల్లడిస్తారు.
మిన్నీ పేన్‌కి రాయడం పట్ల ప్రేమ
ఆమె 23 ఏళ్ల మనవడు, ఆ రోజు డిగ్రీ పొందుతున్న ఆమె బ్యాచ్‌మేట్ కూడా, ఆమె నెమ్మదిగా పోడియం వద్దకు వెళుతుండగా ఆమె చేతిని మనవడు పట్టుకుని నడిపించాడు. ఆమె డిగ్రీని అందుకొని, ఫ్లాషింగ్ కెమెరాలకు పోజులివ్వడంతో ప్రేక్షకులు పేన్‌ను ఉత్సాహపరిచారు.
మిన్నీ పేన్ గ్రీన్‌విల్లే నుండి 16 మైళ్ల దూరంలో ఉన్న ఒక చిన్న పట్టణంలో సౌత్ కరోలినాలో పెరిగారు. ఆమె కుటుంబం వస్త్ర వ్యాపారంలో ఉందని, వారికి అంత సంపద లేదని ఆమె చెప్పారు.
"నేను చాలా చిన్న ప్రపంచంలో జీవించాను," అని పేన్ అన్నారు. మా ఊరిలో "ఒక సినిమా థియేటర్, ఒక మందుల దుకాణం, ఒక పోస్టాఫీసు, ఒక సర్వీస్ స్టేషన్, ఒక కిరాణా దుకాణం ఉన్నాయి" అని ఆమె తన పట్టణమైన పెల్జర్ గురించి చెప్పింది. ఆమె 1950లో ఉన్నత పాఠశాల నుండి పట్టభద్రురాలైంది. మంచి ఉద్యోగం వచ్చే వరకు ఖాళీగా ఉండడం ఎందుకని గుమాస్తాగా జూనియర్ కళాశాలలో చేరింది.
1961లో డేల్‌ను వివాహం చేసుకుంది. భర్త ఉద్యోగ రీత్యా అనేక రాష్ట్రాలకు వెళ్లారు. ఆమె తన ఇద్దరు పిల్లలను చూసుకోవడానికి కొంతకాలం గృహిణిగా ఉంది. ఆ తర్వాత ఆమె 30 ఏళ్లపాటు ఉపాధ్యాయురాలిగా, ట్రాన్స్‌క్రిప్షనిస్ట్ గా , వర్డ్ ప్రాసెసర్‌గా అనేక ఉద్యోగాలు చేసింది.
జర్నలిజం అంటే చాలా ఇష్టం. అందుకే 60 ఏళ్ల వయసులో కోర్సు పూర్తి చేసింది. కరోనా మహమ్మారి ఆమె కలలపై నీళ్లు చల్లింది. దాంతో కొంతకాలం పాటు తన ఆలోచనలకు తాత్కాలికంగా విరామం ప్రకటించినా, వెంటనే ఇంటర్ డిసిప్లినరీ ఆన్‌లైన్ కోర్సును చేపట్టాలని నిర్ణయించుకుంది. మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసింది. "ఒక వ్యక్తి తమను తాము మెరుగుపరుచుకోవడం ప్రారంభించాలి. అలాంటి వ్యక్తులతో కలవాలి. అప్పుడే వారు ఉన్నత లక్ష్యాల వైపు ముందుకు సాగడానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది అని ఆమె చెప్పింది.
నేను బాగా చేయాలనుకున్నాను, నేను చాలా రాత్రులు, చాలా సమయం చదువుతూ గడిపాను. అందులో ఆనందాన్ని పొందాను అని పేన్ చెప్పారు. "నేను ఒక పెద్ద విజయాన్ని సాధించాను, కానీ నాకు ఇంకా చాలా మంచి జీవితం మిగిలి ఉందని నేను భావిస్తున్నాను", "నేను చివరి నిమిషం వరకు పని చేయాలనుకుంటున్నాను. ఎవరికైనా సహాయం చేయడానికి ఏదైనా చేయకపోతే, సంతోషంగా ఉండలేను. అదే అసలైన నా ఆరోగ్య రహస్యం అని మిన్నీ పేన్ నవ్వుతూ చెబుతారు. నేటి యువతకు మిన్నీ ఆదర్శం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com