ఇదేం ప్రేమరా నాయనా.. ఎవరూ దొరకనట్టు.. పాముని పెళ్లి చేసుకుని..

ఇదేం ప్రేమరా నాయనా.. ఎవరూ దొరకనట్టు.. పాముని పెళ్లి చేసుకుని..
సరాసలీన్‌ని ఓర కంట చూసిన ఆ పాము కూడా బుసలు కొట్టడం మానేసి తరచూ అతడి కంట పడటం జరుగుతోంది.

ఆపోజిట్ జెండర్‌పై ప్రేమ పుడుతుంది అది సహజం కూడా.. ఈ మధ్య అమ్మాయిలు.. అమ్మాయిలతో, అబ్బాయిలు.. అబ్బాయిలతో ప్రేమలో పడుతున్నారు.. పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.. అది వేరే విషయం.. ఇక్కడ అదీ ఇదీ కాదని పాముని ప్రేమించాడట ఓ మహా.... ను భావుడు.. అవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టు దాన్ని చూడగానే మనసు పారేసుకున్నాడట.. చేసుకుంటే పామునే చేసుకుంటా.. లేదంటే పెళ్లే చేసుకోను అని భీష్మించుక్కూర్చున్నాడట.. ఆ పాముతోనే ఏడడుగులు నడుస్తానని.. సారీ.. పాకుతానని శపథం చేసుకున్నాడు..

ఇంతకీ అతగాడికి పాముని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఎలా వచ్చిందో వివరించాడు.. థాయ్‌లాండ్‌లోని కంచనాబురీకి చెందిన వర్రనాన్ సరాసలీన్ అనే యువకుడికి కొన్నాళ్ల కిందట పది అడుగుల నాగు పాము కనిపించింది. దాన్ని చూడగనే భయం కలగకపోగా ప్రేమ పుట్టింది.. సరాసలీన్‌ని ఓర కంట చూసిన ఆ పాము కూడా బుసలు కొట్టడం మానేసి తరచూ అతడి కంట పడటం జరుగుతోంది. దీంతో స్నేహితులకు, బంధువులకు చెప్పాడు.. ఆ పాముని పెళ్లి చేసుకుంటానని.. దీంతో ఒక్కసారిగా వాళ్లు షాకయ్యారు.

నీకేమైనా పిచ్చి పట్టిందా అని చీవాట్లు పెట్టారు.. అయినా పట్టు బట్టాడు.. పాముతోనే పెళ్లి చేయమని. అదేమంటే చనిపోయిన నా గర్ల్‌ఫ్రెండ్ పాము రూపంలో వచ్చి మళ్లీ ప్రేమలో పడేసిందని చెప్పుకొచ్చాడు. పెద్దలు వద్దని వారిస్తున్నా వినకుండా పాముని పెళ్లి చేసుకున్నాడు.. మరి సంసారం, సాగరం.. ఎలా అంటే అదంతా తూచ్.. మాది పవిత్ర ప్రేమ అంటున్నాడు.. ఇది నాలుగేళ్ల క్రితం జరిగినా ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అయి మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈ విశాల ప్రపంచంలో వింత వింత వార్తలు.. లోకో భిన్న రుచి అంటే ఇదే కాబోలు.

Tags

Read MoreRead Less
Next Story