Thai Prime Minister : థాయ్ ప్రధానికి 75 లగ్జరీ వాచ్‌లు.. 200 డిజైనర్ బ్యాగ్ లు

Thai Prime Minister : థాయ్ ప్రధానికి 75 లగ్జరీ వాచ్‌లు.. 200 డిజైనర్ బ్యాగ్ లు
X

ఇటీవల థాయ్లాండ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పేటోం స్టార్న్ తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. ఆమె తన సంపద విలువ రూ.400 మిలియన్ డాలర్లు (రూ.3,450కోట్లు) ఉంటుందని తెలిపింది. థాయ్లాండ్ కరెన్సీలో చెప్పాలంటే 13.8 బిలియన్ బాత్ లు. అందులో 75 లగ్జరీ వాచ్లు, 200 డిజైనర్ బ్యాగ్ లు ఉన్నాయట. జాతీయ అవినీతి వ్యతిరేక కమిషన్కు ఈ మేరకు ఆమె ఆదాయ, సంపద వివరాలు సమర్పించారు. తన మొత్తం ఆస్తిలో 5 బిలియన్ బాతు అప్పుల కింద చూపించారు. డిపాజిట్లు, నగదు రూపంలో ఒక బిలియన్

బాత్ ఉండగా, లండన్, జపాన్లోనూ ఆస్తులున్నట్లు తెలిపారు. మాజీ ప్రధాని తక్సిన్ షినవత్ర చిన్న కుమార్తెనే ఈ పేటోంగ్జార్న్. మాంచెస్టర్ సిటీ ఫుట్బాల్ క్లబ్కు మాజీ యజమాని అయిన తక్సిన్ ఆస్తుల విలువ 201 బిలియన్ డాలర్లు. ఆయన థాయ్లాండ్ లో 10 మంది సంపన్నుల్లో ఒకరు. టెలికమ్యూనికేషన్ సంస్థ షిన్ కార్పొరేషన్ ద్వారా భారీగా ఆస్తులు కూడబెట్టారు. కాగా, థాయ్లాండ్కు రెండవ మహిళా ప్రధానిగా పేటోంగ్లార్న్ గుర్తింపు పొందారు.

Tags

Next Story