Thailand: కొరియా పిచ్చి... ఓ ప్లాస్టిక్ సర్జరీ... బెడిసి కొట్టిన ఓ డ్రగ్ డీలర్ స్టోరీ...

Thailand: కొరియా పిచ్చి... ఓ ప్లాస్టిక్ సర్జరీ... బెడిసి కొట్టిన ఓ డ్రగ్ డీలర్ స్టోరీ...
కొరియన్ పాప్ సింగర్ అవ్వాలనుకున్న థాయ్ లాండ్ డ్రగ్ డీలర్; ప్లాస్టిక్ సర్జరీతో అందమైన కొరియన్ గా మారిన వైనం...

సినిమా కథలకు ప్రేరణ నిజజీవత గాథలే అనేందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. తాజాగా థాయ్ ల్యాండ్ లో అచ్చం ఇదే విధంగా ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ముఖ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకుని దేశం దాటి వెళ్లిపోవాలనుకున్న ఓ డ్రగ్ డీలర్ ప్లాన్ ను తిప్పికొట్టారు థాయ్ లాండ్ పోలీసులు. వివరాల్లోకి వెళితే షహారత్ సవాంగ్జెంగ్ అనే యువకుడు పాతికేళ్ల వయసు నుంచే డ్రగ్స్ వ్యవాహారంలో స్థానికంగా కీలక పాత్ర పోషిస్తున్నాడు. పలు దేశాల నుంచి MDMA లేదా ఎక్స్టసీ అనే డ్రగ్స్ దిగుమతి చేసుకుని స్థానికంగా విక్రయిస్తూ ఉండేవాడు. ఈ వ్యవహారంలో పలు మార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. అయినప్పటికీ తన దారి తనదే అన్నట్లు షహారత్ ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ పోలీసులను చిత్తు చేస్తూ తప్పించుకుని తిరుగుతున్నాడు. అయితే ఈ క్రమంలో ముఖానికి పలుమార్లు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు షహారత్. తన ముఖం పూర్తిగా మారిపోయింది అని నిర్ధారించుకున్నాక తన పేరు, ఐడెంటీటీ అన్నింటినీ మార్చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. ఈమేరకు తన పేరును సియాంగ్ జిమిన్ గా మార్చుకుని, దక్షిణ కొరియా వెళ్లిపోయి కొత్త జీవితం ప్రారంభించాలని భావించాడు. అన్నీ అనుకున్నట్లుగానే జరుగుతుండటంతో త్వరోలనే దక్షిణ కొరియా ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఈలోగా షహారత్ ఉనికిపై పోలీసులకు సమాచారం అందడంతో అతడిపై మెరుపుదాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. అయితే షహారత్ పూర్వ రూపం పూర్తిగా మారిపోయినట్లు గుర్తించిన పోలీసులు షాక్ అయ్యారు. పాప్ బ్యాండ్ పై మక్కువతో ఉత్తర కొరియాకు వెళ్లిపోవాలని భావంచిన షహారత్ స్థానికంగా కొరియన్ గానే తనని తాను పరిచయం చేసుకుంటున్నాడని విచారణలో తెలిసింది. కావాలనే షరాహత్ కొరియన్ ముఖకవళికలు కోసం సర్జరీ చేయించుకున్నాడని తెలుసుకుని విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story