అదృష్టం తెచ్చిపెట్టే రేఖల్ని కృత్రిమంగా సృష్టిస్తోన్న థాయ్‌ కంపెనీ..

అదృష్టం తెచ్చిపెట్టే రేఖల్ని కృత్రిమంగా సృష్టిస్తోన్న థాయ్‌ కంపెనీ..
హస్తరేఖలను బట్టి జీవితం ఎలా ఉంటుందో తెలియజేసే శాస్త్రమే హస్తసాముద్రికం. ఈ శాస్త్రం భారత్‌తోపాటు అనేక దేశాల్లో బాగా ప్రాచుర్యం పొందింది. వ్యక్తి జీవితం చేతిరేఖలపై ఆధారపడి..

హస్తరేఖలను బట్టి జీవితం ఎలా ఉంటుందో తెలియజేసే శాస్త్రమే హస్తసాముద్రికం. ఈ శాస్త్రం భారత్‌తోపాటు అనేక దేశాల్లో బాగా ప్రాచుర్యం పొందింది. వ్యక్తి జీవితం చేతిరేఖలపై ఆధారపడి ఉందని చాలా మంది అంటుంటారు.. ఇప్పటికీ ఈ విషయాన్ని నమ్ముతారు. అరచేతిలో ఉండే రేఖలలో ఒక్కో రేఖ ఒక్కో అంశాన్ని సూచిస్తాయని చెబుతారు. వివాహం, సంతానం, అదృష్టం, ఆర్థికం, ఆరోగ్యం, ఆయుష్షు ఇలా ప్రతి అంశం చేతిరేకలపైనే ఆధారపడి ఉంటాయని నమ్ముతారు. ఈ శాస్త్రంపై థాయ్‌లాండ్‌ ప్రజలు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తారు. వారి నమ్మకాన్ని థాయ్‌లాండ్ కు చెందిన ఓ కంపెనీ సొమ్ము చేసుకుంటోంది. అదృష్టం తెచ్చిపెట్టే రేఖల్ని కృత్రిమంగా సృష్టిస్తోంది ఈ కంపెనీ.

థాయ్‌లాండ్‌కి చెందిన 'ప్లీ' అనే వ్యక్తి ఒకప్పుడు బీచ్ లు, జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో టాటూలు వేసేవారు. అయితే ఇటీవల నొంతాబురి ప్రాంతంలో 'మహాహెంగ్‌999' పేరుతో ఓ కంపెనీ ప్రారంభించారు.. ప్రజలు తమ మెరుగైన జీవితం పొందడం కోసం వారి చేతిలోని రేఖలను మారుస్తామని ప్రకటించారు. దాంతో చాలా మంది వ్యక్తులు తమ భవిష్యత్తుకోసం ఆ కంపెనీ ముందు క్యూ కట్టారు.. వారికి ఏ అంశంలో మెరుగైన స్థితి కావాలో అడిగి హస్తరేఖల్ని ఎలా మార్చుకుంటే మంచిదనే విధంగా వివరిస్తారు ప్లీ. ఆ తరువాత కంపెనీ సిబ్బంది చేత వ్యక్తులకు తగురీతిలో హస్తరేఖల్ని మార్చడం.. కొత్తవి గీయడం వంటివి చేయిస్తున్నారు.

టాటూలు వేసే విధంగానే అరచేతిలో రంగులు లేకుండా బలవంతంగా గీతల్ని గీస్తున్నారు. అయితే ఇలా గీయడం వలన మొదట్లో చర్మం బాగా కందిపోతుంది. ఆ తర్వాత కొద్దిరోజులకు సహజరేఖల్లానే కనిపిస్తున్నాయట. ఇది తెలిసిన చాలా మంది వ్యక్తులు తమ చేతిరేఖలను మార్చుకోవడం కోసం కంపెనీ ముందు క్యూ కడుతున్నారట. దీంతో ఈ కంపెనీ గురించి దేశవ్యాప్తంగా ప్రచారం జరిగింది. ప్లీ బిజినెస్‌ ఊహించినదానికంటే ఎక్కువ జరుగుతోంది. దాంతో మరొక బ్రాంచ్ ను ఓపెన్ చేసి ఆశావహులకు చేతిరేఖలను మారుస్తున్నారు. అయితే ఇలా మార్చుకున్న వ్యక్తులు తమ జీవితాలు బాగుపడ్డాయని చెప్పడం కూడా జరుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story