CUPOLA: వ్యోమగాముల కలల కిటికీ కుపోలాకు 15 ఏళ్లు

CUPOLA: వ్యోమగాముల కలల కిటికీ కుపోలాకు 15 ఏళ్లు
X
అంతర్జాతీయ వ్యోమగాములకు పుడమి దర్శనం కలిగించే విశేష వేదిక కుపోలా.

అంతరిక్ష కేంద్రంలో ఓ చిన్న గాజు గది... కానీ అంతర్జాతీయ వ్యోమగాములకు పుడమి దర్శనం కలిగించే విశేష వేదిక. దీనిపేరే కుపోలా. ఇది భూమికి సుమారు 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ISS) ఉంది. డోము ఆకారంలో నిర్మించిన ఈ విండో గది 2010లో డిస్కవరీ స్పేస్ షటిల్ ద్వారా ట్రాంక్విలిటీ మాడ్యూల్‌తో పాటు ఐఎస్ఎస్‌కి చేరింది. మొత్తం ఏడుగాజు కిటికీలతో ఉండే ఈ విండో గది వ్యోమగాములకు స్పేస్ స్టేషన్‌ వెలుపల పరిస్థితులను ప్రత్యక్షంగా గమనించే అవకాశమిస్తోంది.

ఈ కిటికీలను ఉల్కల నుంచి రక్షించేందుకు ప్రత్యేక షట్టర్లు, తగిన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి. స్పేస్‌ స్టేషన్‌లో ఉన్న రోబోటిక్‌ చేతుల కదలికలతోపాటు భూమి అందాలను వీక్షించేందుకు ఇది ఉపయోగపడుతుంది. కుపోలా నిర్మాణాన్ని మొదట నాసా–బోయింగ్‌లు ప్రారంభించినప్పటికీ, ఖర్చుల నేపథ్యంలో ప్రాజెక్టును యూరోపియన్‌ స్పేస్ ఏజెన్సీ చేపట్టి విజయవంతంగా పూర్తి చేసింది. ఇటీవల భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఇక్కడ పలు ప్రయోగాలు నిర్వహించగా, ఆయన తీసిన చిత్రాలు వైరల్‌గా మారాయి. భూమిని ఆకాశం నుంచి చూడే అద్భుత కిటికీ కుపోలా. కుపోలా విండో నుంచి భూమి, చంద్రుడు, సూర్యుడు, మరియు నక్షత్రాలను ప్రత్యక్షంగా చూడవచ్చు. వ్యోమగాములు ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇక్కడ కూర్చొని విశ్రాంతి తీసుకుంటారు. ఇది శాస్త్రీయ పరిశీలనలకే కాకుండా భావోద్వేగ అనుభూతులకు వేదికగా మారింది. కుపోలా డిజైన్‌లోని వృత్తాకార కిటికీ – అంతరిక్షంలో ఉన్న అతిపెద్ద గ్లాస్ విండోగా గుర్తింపు పొందింది. దాని ద్వారా తీసిన భూమి చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆశ్చర్యానికి గురిచేశాయి. ఈ విండో ద్వారా అంతరిక్ష కేంద్రంలోని రోబోటిక్‌ ఆపరేషన్లు సులభంగా పర్యవేక్షించవచ్చు. కుపోలా ప్రాజెక్టు మూల్యము దాదాపు 2 కోట్ల యూరోలు కాగా, ఇది సాంకేతికంగా అమూల్యంగా నిలిచింది. వ్యోమగాములు దీనిని "అంతరిక్షంలో మనిషికి ఉన్న ఒక చిన్న గది – ప్రపంచానికి ఓ గొప్ప కిటికీ"గా వర్ణిస్తారు. కుపోలా వల్ల ISSకి విజ్ఞాన శాస్త్రంలో వినూత్న ప్రయోగాలు చేపట్టేందుకు అదనపు వెసులుబాటు లభించింది. భూమిని తిలకించే ఈ విండో వ్యోమగాముల్లో బాధ్యతాబోదాన్ని పెంచుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Tags

Next Story