Porn Passport: స్పెయిన్ లో పోర్న్ పాస్ పోర్ట్.. 18 ఏండ్లు నిండిన వారికి మాత్రమే..

పోర్నోగ్రఫీ సమస్య ఇప్పుడు ప్రపంచ దేశాలను భయపెడుతోంది. మరీ ముఖ్యంగా చిన్నారులు, మైనర్లకు పోర్న్ వీడియోలు సులభంగా యాక్సెస్ అవుతుండటంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు స్పెయిన్ ప్రభుత్వం త్వరలో ఒక మొబైల్ అప్లికేషన్ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. దీని పేరు 'పోర్న్ పాస్‌పోర్ట్'! నిర్దిష్ట వయస్సు గల లీగల్ యూజర్లకు మాత్రమే పోర్న్ కంటెంట్ అందుబాటులో ఉంచడం ఈ యాప్ లక్ష్యం. చిన్నారులు ఈ కంటెంట్ చూడకుండా ఈ యాప్ జాగ్రత్త పడుతుంది.
స్పెయిన్ ప్రభుత్వానికి చెందిన సరికొత్త డిజిటల్ వాలెట్ యాప్‌లో భాగం ఈ పోర్న్ పాస్‌పోర్ట్. దీని అధికారిక పేరు డిజిటల్ వాలెట్ బీటా (కార్టెరా డిజిటల్ బీటా). పోర్న్ చూస్తున్న వ్యక్తికి నిర్దిష్ట వయస్సు పరిమితి ఉందా? లేదా? అనేది చెక్ చేసేందుకు ఇంటర్నెట్ ప్లాట్‌ఫామ్స్‌కి ఈ యాప్ అనుమతులు ఇస్తుంది.
త్వరలో అందుబాటులోకి వచ్చే ఈ యాప్‌లో వినియోగదారులు తమ వయస్సును వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ పూర్తైన తర్వాత, వారికి 30 పోర్న్ క్రెడిట్స్ వస్తాయి! వాటి ద్వారా పోర్న్ కంటెంట్‌కి యాక్సెస్ లభిస్తుంది. నెల రోజుల పాటు ఈ పోర్న్ క్రెడిట్స్ వాలిడ్‌గా ఉంటాయి.
ఒక్కో క్రెడిట్‌కి ఒక్కో క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుందని తెలుస్తోంది. పోర్న్ సైట్ అడ్రెస్‌ని టైప్ చేస్తే, ఒక లింక్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే, డిజిటల్ వాలెట్‌తో కనెక్షన్ ఏర్పడుతుంది. ఆ వాలెట్ ద్వారా యూజర్ క్రిడెన్షియల్స్ వెలుగులోకి వస్తాయి. ఇతర వివరాలేవీ ఇవ్వకుండా, కేవలం యూజర్ వయస్సు మాత్రమే వెరిఫై చేయడం జరుగుతుంది. ఒక టోకెన్‌తో ఒకే వెబ్‌సైట్‌ని దాదాపు 10సార్లు వినియోగించుకోవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com