గాలిలో విరిగిన విమానం కిటికీ.. 174 మంది ప్రయాణికుల ప్రాణాలు సురక్షితంగా..

గాలిలో విరిగిన విమానం కిటికీ.. 174 మంది ప్రయాణికుల ప్రాణాలు సురక్షితంగా..
అలాస్కా ఎయిర్‌లైన్స్ విమానం కిటికీ గాలిలో విరిగింది. విమానం పోర్ట్‌ల్యాండ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేయబడింది.

అలాస్కా ఎయిర్‌లైన్స్ విమానం కిటికీ గాలిలో విరిగింది. విమానం పోర్ట్‌ల్యాండ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేయబడింది. విమానంలోని ప్రయాణికులు ఇది ఒక పీడకలగా, బాధాకరమైన అనుభవంగా అభివర్ణించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది.

అమెరికాకు చెందిన అలాస్కా ఎయిర్‌లైన్స్ విమానం గాలిలో కిటికీలు విరిగిపోవడంతో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఆకాశంలో ఒక్కసారిగా విమానం అద్దాలు పగిలిపోవడంతో ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ విషయాన్ని స్వయంగా విమానయాన సంస్థలు తెలిపాయి. విమానంలో ఆరుగురు సిబ్బంది, 174 మంది ప్రయాణికులు ఉన్నారు. పైలట్ తెలివితేటల వల్ల ప్రయాణికులందరి ప్రాణాలు కాపాడబడ్డాయి.

దీనిపై విచారణ జరుపుతామని, పోర్ట్‌ల్యాండ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని సురక్షితంగా దించామని ఎయిర్‌లైన్స్ తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా బయటకు రావడంతో వైరల్‌ అవుతోంది. వీడియోలో సీటుకు సమీపంలో ఒక రంధ్రం కనిపిస్తుంది.

కాలిఫోర్నియాలోని అంటారియోకు బయలుదేరిన అలస్కా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 1282, టేకాఫ్ అయిన 20 నిమిషాల తర్వాత 174 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో పోర్ట్‌ల్యాండ్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది. జనవరి 5వ తేదీ శుక్రవారం ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. విమానం ఒరెగాన్ నుండి కాలిఫోర్నియాలోని అంటారియోకు వెళ్లింది.

అలాస్కా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ AS1282కి సంబంధించిన సంఘటన గురించి తమకు సమాచారం అందిందని బోయింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో తెలిపింది. మేము మరింత సమాచారాన్ని సేకరించేందుకు కృషి చేస్తున్నాము. మా ఎయిర్‌లైన్ కస్టమర్‌తో సంప్రదింపులు జరుపుతున్నాము. బోయింగ్‌కు చెందిన సాంకేతిక బృందం దర్యాప్తులో సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది అని పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story