విమానం గాల్లో ఉండగానే ఊడిన టైర్..

శాన్ ఫ్రాన్సిస్కో నుండి టేకాఫ్ అయిన వెంటనే యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం టైర్ ఊడి కింద పడింది. జపాన్‌కు వెళ్లే యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం శాన్ ఫ్రాన్సిస్కో నుండి టేకాఫ్ అయిన తర్వాత టైర్‌ను కోల్పోయింది. అనంతరం లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల ప్రకారం విమానంలో 235 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బంది ఉన్నారు. విమానం ఎడమ వైపు ప్రధాన ల్యాండింగ్ గేర్ లో ఉన్న ఆరు టైర్లలో ఒకటి కోల్పోయింది.
టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు, అయినప్పటికీ శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఉద్యోగుల కారు పార్కింగ్ స్థలంలో ల్యాండ్ అయింది. దాంతో అక్కడి కార్లు డ్యామేజ్ అయ్యాయి.
సంఘటన జరిగిన వెంటనే, బోయింగ్ 777 ఒక అసమానమైన ల్యాండింగ్ చేసింది. రన్‌వేలో మూడింట రెండు వంతుల మార్గంలో ఆగిపోయింది. 2002లో నిర్మించిన ఈ విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా రూపొందించినట్లు ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులను మరో విమానంలో తరలించనున్నట్లు ఎయిర్‌లైన్స్ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తదుపరి విచారణ జరుపుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com