US War Ship: ఇజ్రాయెల్‌కు వచ్చిన అమెరికా యుద్ధ నౌక

US War Ship: ఇజ్రాయెల్‌కు వచ్చిన అమెరికా యుద్ధ నౌక
X
భీకర పోరుకు రెడీ ...

హమాస్ దళాలపై యుద్ధం ప్రకటించిన ఇజ్రాయెల్ దళాలకు మరింత సాయం చేసేందుకు అమెరికా ముందుకు వచ్చింది. ఆ దేశానికి యుద్ధ నౌకలు, విమానాలు పంపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ నేపధ్యంలో అమెరికా దేశానికి చెందిన అత్యంత అధునాతన యుద్ధ నౌక యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ఇజ్రాయెల్ దేశానికి చేరింది.

ఇజ్రాయెల్ పై అత్యంత వ్యూహాత్మకంగా భూమి, ఆకాశం, సముద్ర మార్గాల్లో పాలస్తీనా తీవ్రవాద సంస్ధ హమాస్ చేసిన , చేస్తున్న దాడులు ఆ దేశాన్ని ఉక్కికిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ దాడుల్లో ఇజ్రాయెల్ కు భారీ నష్టం వాటిల్లుతుండగా... అమెరికాతో పాటు పలు ఇజ్రాయెల్ మిత్రదేశాల పౌరుల కిడ్నాప్ లు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇజ్రాయెల్ లో తమ పౌరుల్ని హమాస్ చంపేస్తునట్లు నిర్ధారించుకున్న అమెరికా.. రంగంలోకి దిగింది. తక్షణం తమ యుద్ధ నౌకల్ని, యుద్ధ విమానాల్ని కూడా పంపింది. ప్రస్తుతానికి అమెరికా పంపిన అరివీర భయంకర యుద్ధ నౌక యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ నౌక శత్రు సేనల పట్ల అత్యంత ప్రమాదకరమైనదని నిపుణులు చెబుతున్నారు.

భూ, వాయు మార్గాల్లో దాడులు చేసే క్షిపణుల్ని ఈ నౌకల ద్వారా పంపుతోంది. అంతే కాదు ఈ యుద్ధ నౌకల్లో దాడుల్ని ముందుగానే గుర్తించే అత్యాధునిక నిఘా పరిజ్ఞానం కూడా అందుబాటులో ఉంచింది. ఈ యుద్ధ నౌకకు యునైటెడ్ స్టేట్స్ యొక్క 38వ అధ్యక్షుడు గెరాల్డ్ ఫోర్డ్ పేరు పెట్టారు. రెండవ ప్రపంచ యుద్ధంలో నావికా సేవలో పసిఫిక్ థియేటర్‌లోని తేలికపాటి విమాన వాహక నౌక మోంటెరీలో యుద్ధ విధులు నిర్వర్తించింది.

ప్రస్తుతానికి అట్లాంటిక్ మహా సముద్రంలో ఉన్న ఈ యుద్ధనౌకలో యూఎస్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ భారీ ఆయుధాలున్నాయి. ఈ నౌకలో విమాన వాహక నౌకతోపాటు గైడెడ్ మిస్సైల్ క్రూయిజర్, యూఎస్ఎస్ నార్మాండీ, గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్లు, యూఎస్ఎస్ థామస్ హడ్నర్, యూఎస్ఎస్ రామేజ్, యూఎస్ఎస్యూఎస్ఎస్ కార్నీ, యూఎస్ఎస్ రూజ్‌వెల్ట్ ఉన్నాయని యూఎస్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ వెల్లడించారు. యూఎస్ సెంట్రల్ కమాండ్, యూఎస్ వైమానిక దళం ఎఫ్-15, ఎఫ్-16, ఎ-10 ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ స్క్వాడ్రన్‌లను పెంచడానికి సైన్యం చర్యలు తీసుకుంది అని చెప్పారు.ఈ నౌక భారీ వైమానిక బాంబు దాడులతో ప్రతిస్పందించింది. ఇజ్రాయెల్ పౌరులను రక్షించడానికి, భయంకరమైన తీవ్రవాద దాడుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి యూఎస్ యుద్ధ నౌక ఉపయోగపడనుంది.

Tags

Next Story