Donald Trump: నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడే యుద్ధానికి ముగింపు ఇస్తా

Donald Trump: నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడే యుద్ధానికి ముగింపు ఇస్తా
X
ఇరాన్‌ దగ్గర ఇంకేమీ మిగల్లేదన్న అమెరికా అధ్యక్షుడు

ఇజ్రాయెల్, అమెరికా మరియు ఇరాన్‌ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.. “ఇరాన్‌లోని సైనిక, ఇంధన స్థావరాలపై అనేక దాడులు జరిపాం. దాదాపు ఎటువంటి లక్ష్యాలు మిగిలివుండలేదు.. నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడే యుద్ధాన్ని ముగించగలను.” అని చెప్పుకొచ్చారు. కాగా, ఫిబ్రవరి 28 నుండి ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటివరకు వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా, ఇజ్రాయెల్ అనేక ఇరానియన్ సైనిక, ఇంధన స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నారు. ప్రతీకారంగా, ఇరాన్ అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేస్తోంది.

ఇరాన్.. గల్ఫ్ ప్రాంతంలో అనేక దాడులు నిర్వహించింది. దుబాయ్ విమానాశ్రయం సమీపంలో డ్రోన్లతో పేలుళ్లు, కొన్ని వాణిజ్య నౌకలు లక్ష్యంగా అయ్యాయి. దాడులు కొనసాగుతున్నప్పటికీ, విమానాశ్రయంలో ఆ విమానాలు సర్వీస్ కొనసాగుతున్నాయి. అయితే, డొనాల్డ్‌ ట్రంప్‌ మాత్రం.. “ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకోవడానికి దాదాపు ఏమీ మిగిలి లేదు. కొంచెం మాత్రమే ఉంది. నేను కోరుకున్నప్పుడల్లా ఈ యుద్ధం ముగుస్తుంది” అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. అయితే, యుద్ధం ముగించే అధికారిక వ్యూహం లేదా కాల్పుల విరమణ ప్రక్రియ గురించి స్పష్టత ఇవ్వలేదు. ఇజ్రాయెల్ అధికారులు మరియు అమెరికా సైనికుల ప్రకారం, కనీసం రెండు వారాల పాటు దాడులు కొనసాగించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ప్రకటన మధ్యప్రాచ్యంలోని పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగా ఉన్నప్పుడు వచ్చిందని విశ్లేషకులు సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా, మార్కెట్లు, మరియు భద్రతా పరిస్థితులు దీని ప్రభావంలో ఉన్నాయి.

Tags

Next Story