The World Scariest Criminal: టాటూస్ పిచ్చి.. ఇంత పీక్స్‌లోనా..!!

The World Scariest Criminal: మామూలుగా ఒక క్రిమినల్‌ను చూస్తుంటే సామాన్యులు ఎవరికైనా భయమేస్తుంటుంది. కానీ అతడి రూపురేఖలు కూడా భయంకరంగా ఉంటే.. అతడి ఫోటో చూడడానికి కూడా భయమేసేలా ఉంటే.. అలాంటి క్రిమినల్ ఎక్కడ ఉన్నాడో అనుకుంటున్నారా.. మిస్సోరిలో. అతడిని చూస్తేనే మామూలు వారు ఎవరైనా భయంతో వణికిపోవాల్సిందే అన్నట్టుగా ఉంటుంది అతడి ఆకారం.
మిస్సోరీకి చెందిన 46 ఏళ్ల మైఖేల్ కాంప్‌బెల్ ఇటీవల అత్యాచారయత్నం కేసులో అరెస్టు అయ్యాడు. దాంతో పాటు ఇతడిపై ఇంతకు ముందే పలు కేసులు ఉన్నట్టు పోలీసులు అంటున్నారు. గతేడాది ఆస్తి నష్టం, దాడి వంటి ఆరోపణలతో ఆరు నెలలు జైలు శిక్షను అనుభవించాడు మైఖేల్. అతడు 20 ఏళ్లు ఉన్నప్పుడే అతడిపై మొదటిసారి కేసు నమోదయ్యిందని వారు అంటున్నారు.
మైఖేల్‌ను చూడగానే ఎవరైనా ఎందుకు భయపడతారంటే అతడి మొఖంపై మొత్తం టాటూలే ఉంటాయి. తన కళ్లు తప్ప మరేమీ కనిపించకుండా అంతా టాటూలతో నింపేశాడు. అతడి ముక్కు, పెదవులు, మెడ కింద మాత్రమే చర్మం కనిపిస్తుంది. నుదురు, గొంతు, గుండెపై కూడా మైఖేల్‌కు టాటూలు ఉన్నాయి.
ఇటీవల మైఖేల్ తండ్రి కోవిడ్‌తో చనిపోయాడు. అతని జ్ఞాపకార్థం మైఖేల్ మరో టాటూ వేయించుకున్నాడు. తనతో పాటు తన చెల్లెల్లు కూడా టాటూలు వేయించుకున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా కూడా మారింది. దీంతో వీరికి టాటూ ఫ్యామిలీ అని పేరు పెట్టేశారు నెటిజన్లు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com