కరోనాకు చెక్ పెట్టే థెరపీ.. 14 ఏళ్ల బాలిక సృష్టి.. రూ.18లక్షల ప్రైజ్ మనీ సొంతం

కరోనాకు చెక్ పెట్టే థెరపీ.. 14 ఏళ్ల బాలిక సృష్టి.. రూ.18లక్షల ప్రైజ్ మనీ సొంతం
శక్తివంతమైన థెరపీకి రూపకల్పన చేసింది అని ఫ్రైజ్ మనీ ఛాలెంజ్‌కి జడ్జిగా వ్యవహరించిన డాక్టర్ సిండీ మాస్ తెలిపారు.

కరోనా గురించి వింటూ.. కరోనా వార్తలు చదువుతూ అనిక అందరిలా ఊరుకోలేదు.. మాయదారి మహమ్మారిని మట్టుపెట్టే ఆలోచనలు చేయసాగింది.. వైరస్‌నుంచి మనషులను కాపాడే శక్తివంతమైన థెరపీని ఆ బాలిక కనిపెట్టింది. అమెరికా.. టెక్సాస్‌లోని ప్రిస్కోలో నివసిస్తున్న 14 ఏళ్ల అనికా చేబ్రోలు.. 2020 3M యంగ్ సైంటిస్ట్ ఛాలెంజ్ గెలిచి.. రూ.18 లక్షలకు పైగా ప్రైజ్ మనీ గెలుచుకుంది. కరోనా వైరస్ ఉపరితలంపై ఉండే కొవ్వును కట్టడి చేసే ప్రధాన మాలిక్యూల్‌ను ఆమె కనిపెట్టింది.

8వ తరగతి చదువుతున్న అనిక భారత సంతతికి చెందిన అమ్మాయి. ఆమె తన పరిశోధన కోసం ఆమె రకరకాల వైరస్‌లు, వ్యాధులను అధ్యయనం చేసింది. ఏయే వ్యాధులపై ఏ మందులు ఏలా పనిచేస్తాయో తెలుసుకుంది. ఆ దిశగా తన పరిశోధనలు ప్రారంభించింది. కరోనా అంతు చూసేందుకు తన వంతు కృషి చేసి విజయం సాధించింది. అనికా చురుకైన అమ్మాయి.. ఈ ప్రాజెక్ట్‌పై ఎన్నో ప్రశ్నలు వేసి సమాచారాన్ని సేకరించింది.. శక్తివంతమైన థెరపీకి రూపకల్పన చేసింది అని ఫ్రైజ్ మనీ ఛాలెంజ్‌కి జడ్జిగా వ్యవహరించిన డాక్టర్ సిండీ మాస్ తెలిపారు. అనికా రూపొందించిన థెరపీ ద్వారా కరోనా రోగులకు మేలు కలగనుంది అని వివరించారు.

14 ఏళ్ల అనిక మొదట ఫ్లూతో సంబంధం కలిగి ఉన్న ప్రాజెక్ట్ ప్లాన్ చేసింది. తరువాత ఆమె దాన్ని కోవిడ్-19 గా మార్చింది. మహమ్మారితో బాధపడుతున్న రోగులను చూసి ఆమె కరోనా కోసం పని చేసింది. పాఠశాల నుండి బయటకు వచ్చినప్పుడు వైద్య పరిశోధన వృత్తిని చేపట్టాలని అనుకుంది. తన చిన్న తనంలో తాత ఎప్పుడూ సైన్స్ గురించి ఎక్కువ నేర్చుకోమంటూ ప్రోత్సహించేవారు. అతడు కెమిస్ట్రీ ప్రొఫెసర్ కావడంతో మూలకాల పట్టికను నేర్చుకోమనేవారు. ఆ విధంగా తాత సహాయంతో మూలకాల పరిశోధనపై ఆసక్తి కనబరిచింది. ఆమె శాస్త్రీయ భారతీయ నృత్య శిక్షణ కళాకారిణిగా కూడా తన ప్రతిభను కనబరుస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story