Chinese woman: స్మశానంలో ఉద్యోగం.. రూ.45 వేలు జీతం

Chinese woman: స్మశానంలో ఉద్యోగం.. రూ.45 వేలు జీతం
X
Chinese woman: ఉద్యోగం చేసే స్థలం సౌకర్యవంతంగా ఉంటే ఎక్కడైనా చేయొచ్చంటోంది ఈ చైనా అమ్మాయి.

Chinese Woman: ఉద్యోగం చేసే స్థలం సౌకర్యవంతంగా ఉంటే ఎక్కడైనా చేయొచ్చంటోంది ఈ చైనా అమ్మాయి. అవసరం కోసం ఆమె స్మశానంలో ఉద్యోగం చేస్తుందనుకుంటే పొరపాటే.. 22 టాన్ స్మశాన వాటికలో పని చేయడం తనకు చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెబుతోంది. ఉద్యోగం తనకు పని మరియు వ్యక్తిగత జీవితానికి మధ్య సమతుల్యతను అందిస్తోందని అంటోంది. సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేస్తూ తనను తాను గ్రేవ్ కీపర్ గా పరిచయం చేసుకుంది.

తన కార్యాలయంలోని వీడియోలను తరచుగా పంచుకునే టాన్ తన ఉద్యోగాన్ని ఇష్టపడతానని పేర్కొంది. ఇక్కడ తనకు తగినంత విశ్రాంతి సమయం కూడా లభిస్తుంది అని తెలిపింది. ఇక టాన్ అందుకుంటున్న నెలవారీ జీతం దాదాపు 4,000 యువాన్లు (రూ. 45,760).

Tags

Next Story