Pakistan Air Base: యుద్ధ విమానాలను ధ్వంసం చేసిన పాక్ ఉగ్రవాదులు

పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. ఏకంగా ఎయిర్‌బేస్‌పైనే అటాక్ చేశారు. మియాన్‌వాలీ వైమానిక దళ శిక్షణ కేంద్రంపై ఇవాళ తెల్లవారుజామున ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ శిక్షణ కేంద్రంలో ఉన్న విమానాలను ధ్వంసం చేశారు. కొన్నింటికి నిప్పుపెట్టినట్టు సమాచారం. సోషల్ మీడియాలో ఆ దాడులకు చెందిన వీడియోలు కొన్ని అప్‌లోడ్ చేశారు. పాక్ ఆర్మీ మాత్రం మూడు విమానాలు ధ్వంసం అయినట్లు అధికారికంగా ప్రకటించింది.
దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ చివరకు ఆ ఉగ్రభూతానికే బాధితురాలుగా మిగులుతోంది. ఇప్పటికే పలు ఉగ్రదాడులు పాక్ ను వణికించాయి. తాజాగా ఈ ఉదయం మరో ఉగ్రదాడి పాక్ ను భయభ్రాంతులుకు గురి చేసింది. పంజాబ్ ప్రావిన్స్ లోని మియన్వాలిలో ఉన్న పాక్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన వైమానిక స్థావంరంపై ఈరోజు ఉదయం టెర్రరిస్టు దాడులు జరిగాయి. ఈ దాడుల్లో మూడు విమానాలు, ఫ్యూయల్ ట్యాంకర్ ధ్వంసమయ్యాయి. కౌంటర్ అటాక్ కు దిగిన పాక్ ఆర్మీ... ముగ్గురు మిలిటెంట్లను మట్టుబెట్టింది. మరో ముగ్గురు ఉగ్రవాదులను కార్నర్ చేసింది.
నిన్న కూడా పాక్ ఆర్మీ వాహనాలను ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. రెండు వాహనాలపై జరిపిన దాడిలో 14 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. గదార్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడుల నేపథ్యంలో పాక్ ఆర్మీ అధికారులు స్పందిస్తూ... దేశంలో ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.
ఈ దాడిని తామే చేశామని పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఏ-జిహాద్ పాకిస్థాన్ ప్రకటించింది. ఉగ్రవాదులు, పాక్ సైన్యానికి మధ్య పాకిస్థాన్‌లోని మియాన్‌వలీ ఎయిర్ బేస్ లో భీకర కాల్పులు జరుగుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com