United States : అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు

United States : అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
United States : అగ్రరాజ్యం అమెరికాలో కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. న్యూయార్క్ సూపర్​ మార్కెట్‌ కాల్పుల ఘటన మరవకముందే మరోసారి కాల్పులు మోత మోగింది.

United States : అగ్రరాజ్యం అమెరికాలో కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. న్యూయార్క్ సూపర్​ మార్కెట్‌ కాల్పుల ఘటన మరవకముందే మరోసారి కాల్పులు మోత మోగింది. దేశంలోని పలు ప్రాంతాల్లో దుండగులు చేసిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా.. 8 మంది తీవ్ర గాయాల పాలయ్యారు.

హోస్టన్​ సూపర్ మార్కెట్‌లో ఐదుగురు వ్యక్తుల చెలరేగిన వివాదం కాల్పులకు దారితీసింది.ఈ ఘటనలో ఇద్దరు మృత్యువాతపడగా....ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు. నిందితుల్లో ఇద్దరిని ఘటనాస్థలంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు...మరొకరికి గాయాలు కావటంతో ఆస్పత్రికి తరలించారు. నిందితుల నుంచి రెండు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల ఘటనలో స్థానికులెవరూ గాయపడలేదని పోలీసులు స్పష్టం చేశారు. అయితే నిందితులందరు 20 ఏళ్ల వ్యక్తులేనని పోలీసులు చెప్పారు.

అటు కాలిఫోర్నియాలోని చర్చ్​లో జరిగిన కాల్పుల్లో ఒకరు దుర్మరణం పాలయ్యారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. ఘటనలో ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తుపాకిని స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం న్యూయార్క్‌లోని ఓ సూపర్‌ మార్కెట్‌లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డారు. సైనిక వేషదారణతో సూపర్‌ మార్కెట్‌లోకి ప్రవేశించిన 18 ఏళ్ల దుండగుడు.. అక్కడున్న వారిపైకి విచక్షణారహితంగా కాల్పులు తెగబడ్డాడు. ఘటనలో పది మంది మృతి చెందగా.. ముగ్గురికి గాయాలయ్యాయి.

Tags

Next Story