20 Jan 2021 12:06 PM GMT

Home
 / 
అంతర్జాతీయం / నాన్న రిటైర్‌మెంట్.....

నాన్న రిటైర్‌మెంట్.. కూతురు ఎంగేజ్‌మెంట్!

అమెరికా అధ్యక్ష పదవికి గుడ్‌బై చెప్పే ఒక్క రోజు ముందు ట్రంప్ కూతురు టిఫనీ ట్రంప్ (27) ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. మూడేళ్లుగా ప్రేమిస్తున్న మైఖేల్ బౌలస్ (23)తో నిన్న ఎంగేజ్‌మెంట్ జరిగిందని తెలిపింది.

నాన్న రిటైర్‌మెంట్.. కూతురు ఎంగేజ్‌మెంట్!
X

అమెరికా అధ్యక్ష పదవికి గుడ్‌బై చెప్పే ఒక్క రోజు ముందు ట్రంప్ కూతురు టిఫనీ ట్రంప్ (27) ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. మూడేళ్లుగా ప్రేమిస్తున్న మైఖేల్ బౌలస్ (23)తో నిన్న ఎంగేజ్‌మెంట్ జరిగిందని తెలిపింది. కుటుంబ సభ్యులతో కలిసి వైట్‌హౌస్‌లో నిశ్చితార్థం జ‌రుపుకోవ‌డం సంతోషంగా ఉంది. మైఖేల్‌తో నిశ్చితార్థం నాకు ప్రత్యేక సందర్భం. ఇంత‌క‌న్నా అదృష్టం ఇంకేదీ లేదు అంటూ పేర్కొంది. ట్రంప్, ఆయన రెండో భార్య మర్లా మాపుల్స్ ఏకైక సంతానమే టిఫనీ. ఎంగేజ్‌మెంట్ కోసం దుబాయ్ నుంచి ప్రత్యేకంగా 13 క్యారెట్ల ఎమరాల్డ్ కట్ డైమండ్ రింగ్ తెప్పించారట. దీని ఖరీదు 1.2 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.9కోట్లు) ఉంటుంద‌ని అంచనా. కాగా, టిఫనీ ట్రంప్ జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్నారు.

Next Story