అంతర్జాతీయం

వ్యాక్సిన్ వేయించుకుంటే బీరు ఫ్రీ..

వ్యాక్సిన్ వేయించుకోండి అని చాలా దేశాలు తాయిలాలు ప్రకటిస్తున్నాయి ఆయా దేశాల జనాభాకు.

వ్యాక్సిన్ వేయించుకుంటే బీరు ఫ్రీ..
X

జూలై 4 నాటికి 70 శాతం జనాభాకు టీకాలు వేయాలన్న అధ్యక్షుడు జో బిడెన్ లక్ష్యాన్ని దేశం చేరుకుంటుంది. అందుకే 21 ఏళ్ల లోపు యువతను టీకాలు వేయించుకుంటే బీరు ఫ్రీ అనే ఆఫర్ ని ప్రకటించింది అన్ హైజర్ - బుష్ కంపెనీ.

టీకా వేయించుకుని తమ వెబ్ సైట్ లో పేరు నమోదు చేయించుకున్న తొలి 2 లక్షల మందికి 5 అమెరికన్ డాలర్ల (రూ.350) బీరును ఉచితంగా ఇస్తామని ప్రకటించింది.

బిడెన్, గత వారం ప్రారంభంలో, అమెరికాలో టీకా పురోగతిపై ఆశాభావం వ్యక్తం చేశారు. "ఎక్కువ మంది అమెరికన్లు టీకాలు వేయించుకున్నప్పుడు, రోజులు ప్రశాంతంగా గడుస్తాయి అని వర్జీనియాలో ఒక ప్రసంగంలో ఆయన అన్నారు.

Next Story

RELATED STORIES