France: సముద్రంలో విమానం సేఫ్ లాండింగ్
గత కొంతకాలంగా విమానాలు ఎంత కామనో.. విమాన ప్రమాదాలు కూడా అంతేకామన్ అయిపోయాయ. తాజాగా ఇలాంటి ఘటన ఫ్రాన్స్ లోని మార్చెయిల్లో వెలుగు చూసింది. గాల్లో ఎగురుతున్న విమానం ఇంజిన్ లో సమస్యలు తలెత్తడంతో ఇంజిన్ ముందుకు సాగలేదు. తప్పనిసరి పరిస్థితిలలో ఓ పైలట్ విమానాన్ని సముద్రంలోనే అర్ధాంతరంగా దించేశాడు. అయితే విమానంలో అందరూ క్షేమంగా బయటపడ్డారు.
ఆదివారం ఉదయం 10 సమయంలో ఫ్రాన్స్ లోని మధ్యధరా సముద్ర తీరం ఫ్రైజుస్ వద్ద ఈ సంఘటన జరిగింది . చిన్న పర్యాటక విమానం సెస్నా 177 ప్లెయిన్ సాంకేతికలోపం తలెత్తింది. ఇంజన్ స్ట్రక్ అయిపోవడంతో పైలెట్ విమానాన్ని సముద్రంలో ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో విమానం నీటిలో మునిగిపోయింది. కానీ.. అదృష్టవశాత్తు అందులోని ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు.
తీరానికి మరో 600 మీటర్ల దూరం ఉందనగా ఈ సమస్య మొదలయ్యింది. పైలెట్ విమానాన్ని ఎలాగైనా తీరం వరకు తీసుకెళ్దాం అని ప్రయత్నించినా కుదరలేదు. దీంతో పైలట్ సముద్ర జలాల్లోనే అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేశాడు. ల్యాండ్ చేసేముందు సమాచారం అందించడంతో అత్యవసరర విభాగం సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. చిన్న విమానం కావడంతో
ఆ సమయంలో విమానంలో ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు. ఆ ముగ్గురిని సిబ్బంది రక్షించారు. ఫ్రైజుస్ బీచ్ లో జనం రద్దీ ఎక్కువగా ఉంటుంది. అక్కడ అత్యవసరంగా విమానం ల్యాండింగ్ చేయడం కన్నా, సముద్రంలో లాండింగ్ చేయడం అనేది మంచి నిర్ణయం అని అధికారులు సైతం భావించారు. జనాలను ఆ ప్రాంతం నుంచి బయటకు పంపించి లాండింగ్ చేయడం కంటే సముద్రంలో లాంచ్ చేయటమే ప్రమాదం జరగకుండా ఉండటానికి ఎక్కువ అవకాశాలు కలిగిస్తుంది అని భావించడంలో తప్పేం లేదన్నారు.నిజానికి ఇలా చేయడానికి పైలెట్ కు ఎంతో నైపుణ్యం ఉండాలి. దీనికి తోడు అదృష్టం కూడా కలిసి రావాలి. ఈ ప్రమాదం తర్వాత విమానం పూర్తిగా సముద్రంలో మునిగిపోయింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com