South africa : ప్రాణాలు తీరిన ఆశ

South africa : ప్రాణాలు తీరిన ఆశ
X
మైనింగ్ కోసం వాడే గ్యాస్ లీక్, 16 మంది మృతి

దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం జరిగింది. విషపూరితమైన గ్యాస్ లీకేజ్ సంఘటనలో 16 మంది మరణించారు. మృతుల్లా ఐదుగురు మహిళలు ముగ్గురు చిన్నారులు ఉన్నారు. అవును ఉన్నట్టు సమాచారం. అక్రమ మైనింగ్ కార్యకలాపాల కోసం ఉపయోగించే గ్యాస్ లీకేజ్ తోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. సౌత్ ఆఫ్రికాలో జోహన్నెస్ బర్గ్ కు తూర్పున ఉన్న బోక్స్ బర్గ్ సమీపంలోని ఏంజెలో ఈ ప్రమాదం జరిగింది. ముందు సంఘటనా స్థలంలో పేలుడు సంభవించిందని అధికారులు భావించారు. మృతులు 24 మంది వరకు ఉండొచ్చని అంచనా వేశారు కానీ, తర్వాత దానిని విష వాయువు లీకేజీ వల్ల జరిగిన ప్రమాదంగా గుర్తించారు. అక్రమ మైనింగ్ కార్యకలాపాల కోసం ఈ గ్యాస్ ను వినియోగిస్తారు.





దక్షిణాఫ్రికాకు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన గొప్ప బంగారు మైనింగ్ చరిత్ర ఉంది. అయితే ఇక్కడ బంగారం ఉత్పత్తి ఇటీవలి సంవత్సరాలలో తగ్గుతోంది. అయినప్పటికీ, ఇది ఆఫ్రికన్ ఖండంలో అతిపెద్ద బంగారు ఉత్పత్తిదారులలో ఒకటిగా ఉంది.

బంగారం ఏర్పడటం విషయానికి వస్తే కొందరు శాస్త్రవేత్తలు శిలాజాల వల్ల భూమి లోపల బంగారం తయారైందని చెబుతారు. ఇంకొందరు అంటున్నారు. మిలియన్ల మరియు బిలియన్ల సంవత్సరాల క్రితం భూమిపై తోకచుక్కలు వర్షం కురిపించాయని, అప్పుడు వివిధ రకాలైన లోహాలు భూమి లోపల లోతుగా నాటుకున్నాయని చెబతుంటారు.అందులో బంగారం కూడా ఒకటి అని అంటారు. ఏది ఏమైనా భూమి లోపల నుంచి బంగారం తీయడానికి మైనింగ్ ఒకటే మార్గం. అయితే ఈ మైనింగ్ లో హానికరమైన వాయువులను ఉపయోగిస్తారు మరియు మైనింగ్ తర్వాత కూడా హానికరమైన వాయువుల ఉత్పత్తి అవుతాయి.

దక్షిణాఫ్రికాలి 32 శాతం వరకు నిరుద్యోగం ఉంది. అందుకోసమే ప్రజలు అక్రమంగా మైనింగ్ కార్యకలాపాలకు పాల్పడుతూ ఉంటారు. మైనర్లతో కూడా కలిసి బంగారు కానుల్లో ప్రమాదకర పరిస్థితుల్లో బంగారం కోసం వెతుకుతూ ఉంటారు. మూసివేయబడిన గనులు, జన సంచారం లేని ప్రాంతాలు ఎంచుకొని అక్కడికి అక్కడికి కొంతమంది గుంపులుగా వెళ్ళి మైనింగ్ కి ప్రయత్నిస్తారు.

Tags

Next Story