Mexico Train Accident: మెక్సికోలో రైలు ప్రమాదం.. 13 మంది మృతి

Mexico Train Accident: మెక్సికోలో రైలు ప్రమాదం.. 13 మంది మృతి
X
100 మందికి పైగా గాయాలు

దక్షిణ మెక్సికోలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఇంటర్ ఓషియానిక్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా.. 100 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దక్షిణ మెక్సికన్ రాష్ట్రమైన ఓక్సాకాలో ఆదివారం ఇంటర్ ఓషియానిక్ రైలు పట్టాలు తప్పిందని అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది జరిగిన అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలలో ఒకటిగా పేర్కొన్నారు. రైల్లో తొమ్మిది మంది సిబ్బంది, 241 మంది ప్రయాణికులు సహా దాదాపు 250 మంది ఉన్నారని మెక్సికన్ నేవీ తెలిపింది. 193 మంది ప్రమాదం నుంచి బయటపడినట్లు సమాచారం. తొంభై ఎనిమిది మంది గాయపడ్డారని, 36 మంది వైద్య చికిత్స పొందుతున్నారని నేవీ తెలిపింది.

పట్టాలు తప్పడానికి గల కారణాలు వెల్లడి కాలేదు. ప్రమాదానికి దారితీసిన కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటి వరకు 13 మంది చనిపోయారు. ఇక గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సహాయం చేయడానికి సీనియర్ ప్రభుత్వ అధికారులను సంఘటనా స్థలానికి పంపినట్లు అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ ఎక్స్ పోస్ట్‌లో తెలిపారు.

Tags

Next Story