Canada: కెనడా ప్రధాని భారత్ కు కోకైన్ తెచ్చారా?

Canada: కెనడా ప్రధాని భారత్ కు కోకైన్ తెచ్చారా?
ట్రూడోపై సంచలన ఆరోపణలు చేసిన సూడాన్ భారత మాజీ రాయబారి వోహ్రా

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై సంచలన ఆరోపణలు చేశారు సూడాన్ భారత మాజీ రాయబారి దీపక్ వోహ్రా. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన కెనడా ప్రధానికి సంబంధించి కొన్ని విషయాలు వెల్లడించారు. ఇటీవల జరిగిన జీ20 సమావేశానికి ఢిల్లీ వచ్చిన జస్టిన్ ట్రూడో విమానంలో కొకైన్ ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందిందన్నారు. భారత స్నిఫర్ డాగ్స్ ఆయన విమానంలో డ్రగ్స్ గుర్తించాయని ఆయన పేర్కొ్న్నారు. అంతేకాదు ఆ కారణంగానే అతడు రెండు రోజులు బయటకు కూడా రాలేకపోయాని తెలిపారు. ఆ కారణంగా ప్రధాని ఏర్పాటు చేసిన విందుకు కూడా ఆయన హాజరుకాలేదన్నారు. అయితే దీపక్ వోహ్రా కెనడాలోని ప్రధానమంత్రి కార్యాలయం తోసిపుచ్చింది.


సూడాన్‌లో భారత మాజీ రాయబారి దీపక్ వోహ్రా సోమవారం ఓ ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు చేశారు. ఈ నెల జీ20 కోసం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్‌కు వచ్చినప్పుడు, అతని విమానం కొకైన్‌తో నిండి ఉందని, అతను రెండు రోజులు తన గది నుండి బయటకు రాలేదని వోహ్రా అన్నారు. అలాగే ట్రూడో చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తాడని, అంతర్జాతీయ సంబంధాల గురించి అంత పరిజ్ఞానం లేదన్నారు. తన భార్య ఢిల్లీలో ట్రూడోను చూసినప్పుడు ఆయన కాస్త డ్రగ్స్ ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించారని తరువాత సోషల్ మీడియాలో ఆయన డ్రగ్స్ తీసుకున్నట్లు ప్రచారం జరిగిందని వోహ్రో చెప్పారు. ఇక తాను ఉన్న చోట్ల ఏ తప్పు జరగదని ట్రూడో అనుకుంటూ ఉంటారని అయితే అది నిజం కాదన్నారు. కెనడా వీసాలను రద్దు చేసి భారత్ మంచి పనే చేసిందన్నారు.

అయితే, కెనడా ప్రధానమంత్రి కార్యాలయం ఈ ఆరోపణలు నిరాధారమైనవి అంటూ ఖండించింది. ఇది పూర్తిగా అవాస్తవం మరియు తప్పుడు సమాచారమని, తప్పుడు సమాచారం మీడియా రిపోర్టింగ్‌లోకి ఎలా ప్రవేశిస్తుందో చెప్పడానికి ఇది మంచి నిదర్శమని కెనడా ప్రధాని కార్యాలయం పేర్కొన్నట్టు 'టొరంటో సన్' మీడియా సంస్థ ఓ కథనం వెలువరించింది. గత కొంత కాలంగా కెనడా భారత్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఖలిస్తాన్ తీవ్రవాది నజ్జర్ హత్య కేసులో భారత్ హస్తం ఉందంటూ కెనడా ప్రధాని సంచలన ఆరోపణలు చేయడంతో వివాదం మొదలయ్యింది. ప్రస్తుతం అది కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ దౌత్యవేత్త చేసిన ఈ ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story