Donald Trump : విదేశీ కార్లపై 25 శాతం సుంకం

Donald Trump : విదేశీ కార్లపై 25 శాతం సుంకం
X
ట్రంప్‌ మరో సంచలన నిర్ణయం

ట్రంప్‌ ఇప్పటికే వివిధ దేశాలపై సుంకాలను పెంచి వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. విషయం తెలిసిందే. తాజాగా ఆయన మరో నిర్ణయం ఆటోమొబైల్ రంగంలో సంచలనంగా మారింది. అమెరికాకు ఎగుమతి చేయనున్న కార్లపై భారీగా టారీఫ్ సుంకాలు పెంచుతున్నట్లు ట్రంప్ ప్రకటించాడు. ఏప్రిల్ 3 అర్ధరాత్రి తర్వాత కార్ల సుంకాలు అమల్లోకి వస్తాయని వైట్ హౌస్ అధికారి తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగుమతి చేసుకున్న వాహనాలపై 25శాతం సుంకాన్ని పెంచినట్లు ప్రకటించారు. దీంతో గురువారం ఆసియా ఆటో స్టాక్‌లు పడిపోయాయి. ఇది ప్రపంచ వాణిజ్య సమతుల్యతకు దారితీసింది.

అమెరికాలో తయారు చేసిన వాహనాలపై ఎలాంటి సుంకం లేదని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ఏప్రిల్‌ 2 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. బుధవారం వైట్‌హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘అమెరికాలో తయారు కాని అన్ని కార్లపై 25 శాతం సుంకం విధిస్తున్నాం. ఈ సుంకం శాశ్వతంగా ఉంటుంది. యూఎస్‌లో తయారయ్యే వాటిపై మాత్రం ఎలాంటి సుంకం ఉండదు. ఏప్రిల్‌ 2 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. ఈ చర్యతో అమెరికాలో విదేశీ కార్ల ధరలకు రెక్కలు రానున్నాయి.

Tags

Next Story