భారత్‌పై నోరు పారేసుకున్న ట్రంప్‌

భారత్‌పై నోరు పారేసుకున్న ట్రంప్‌
X

అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ భారత్‌పై నోరు పారేసుకున్నారు ట్రంప్‌. ఉత్తర కరోలినా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. వాయు కాలుష్యానికి కారణమంటూ విమర్శలు గుప్పించారు. భారత్‌ను చైనా, రష్యాలతో చేర్చి వాయు కాలుష్యం పెరుగుదలకు ప్రపంచ వ్యాప్తంగా ఈ దేశాలే కారణమవుతున్నాయంటూ ఆరోపించారు. తమ దేశం ఈ విషయంలో చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందంటూ ప్రగల్బాలు పలికారు.

అమెరికా తన పరిపాలనలో పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే.. శక్తివనరుల విషయంలో స్వయం సమృద్ది సాధించిందని ప్రకటించారు. పర్యావరణ గణాంకాల విషయంలో తామే అత్యుత్తమనని చెప్పారు. చైనా, రష్యా, భారత్‌ వంటి దేశాలు హానికర పదార్ధాలను అతిగా విడుదల చేస్తూ వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయన్నారు. ఇక.. బైడెన్‌ వలస విధానం అమెరికా సరిహద్దులనే చెరిపివేసేదిగా ఉందంటూ విమర్శించారు.

Tags

Next Story