Trump-Maduro: వెనెజువెలా ఎయిర్ స్పేస్ క్లోజయినా , మదురో-ట్రంప్ మధ్య ఫోన్ కాల్

వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురోపై ఎప్పుడూ కారాలు.. మిరియాలు నూరే ట్రంప్.. ఆశ్చర్యంగా ఫోన్ సంభాషణ చేశారు. అయితే ఈ సంభాషణ కూడా హాట్‌హాట్‌గానే సాగినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ నుంచి వెనిజులా నుంచి లాటిన్ అమెరికాలోని ఇతర ప్రాంతాలకు మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్న పడవలను లక్ష్యంగా చేసుకుని సముద్రంలో అమెరికా దాడులు చేస్తోంది. ఇప్పటికే చాలా మంది స్మగ్లర్లు హతమయ్యారు. ఈ ఘటనలతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అలాంటిది శనివారం మదురోతో ట్రంప్ ఫోన్ కాల్ సంభాషణ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక వెనిజులా అధ్యక్షుడు మదురోతో మాట్లాడానని.. కాకపోతే ఆ వివరాలు చెప్పలేనని ట్రంప్ పేర్కొన్నారు.
అయితే మయామి హెరాల్డ్ నివేదిక ప్రకారం.. నికోలస్ మదురో సురక్షితంగా దేశం విడిచి వెళ్లే అవకాశాన్ని ట్రంప్ కల్పించినట్లు తెలుస్తోంది. అది కూడా వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని సూచించినట్లు సమాచారం. ఇలా ఇద్దరి మధ్య హాట్‌హాట్ సంభాషణ జరిగినట్లుగా పేర్కొంది. అయితే తనకు, తన సహచరులకు ఆపాదించబడిన నేరాలకు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా క్షమాభిక్ష కల్పించాలని.. అలాగే సాయుధ దళాలపై నియంత్రణ కల్పించాలని మదురో కోరినట్లు తెలుస్తోంది. అయితే తక్షణ రాజీనామాతో సహా వెంటనే దేశం విడిచివెళ్లడాన్ని మదురో నిరాకరించినట్లు తెలుస్తోంది.
అయితే ఇద్దరి మధ్య చర్చలు విఫలమవడంతో ట్రంప్ సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. వెనిజులా రాజధాని కారకాస్‌పై ఒత్తిడిని పెంచుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా సైనిక కార్యకలాపాలు అతి త్వరలోనే వెనిజులాలో ప్రారంభమవుతాయని ట్రంప్ హెచ్చరించారు. వెనిజులా వైమానిక ప్రాంతాన్ని పూర్తిగా మూసివేతకు ట్రంప్ ఆదేశించారు. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అతిపెద్ద విమాన వాహక నౌక యూఎస్ఎస్ గెరాల్డ్, మెరైన్ ఎక్స్‌పెడిషనరీ యూనిట్ ఆఫ్‌పోర్ తీరంలో మోహరించినట్లు తెలుస్తోంది. అయితే అమెరికా చర్యలను మదురో ఖండించారు. దురాక్రమణగా అభివర్ణించారు. వెనిజులా చమురు నిల్వలను బలవంతంగా స్వాధీనం చేసుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

