Donald Trump: కెనడాపై ట్రంప్ మరో టారిఫ్ బాంబ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాపై మరో టారిఫ్ బాంబు పేల్చారు. కెనడా నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్న విద్యుత్తు శక్తిపై ఒంటారియో(కెనడా ప్రావిన్స్) పరస్పర సుంకాలు విధించటం ట్రంప్ సర్కార్‌ను మరింత ఆగ్రహానికి గురిచేసింది. దీంతో కెనడా నుంచి దిగుమతి అవుతున్న అన్ని రకాల స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై సుంకాల్ని 25 నుంచి 50శాతానికి పెంచుతూ ట్రంప్ సర్కార్ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలతో ప్రపంచదేశాలను హడలెత్తిస్తున్నారు. ఇప్పటికే కెనడా, మెక్సికో, చైనా ఉత్పత్తులపై సుంకాలు విధించారు. మరోవైపు అమెరికన్ ఉత్పత్తులపై సుంకాలు విధించే, దేశాలపై పరస్పర సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉంటే, తాజాగా అమెరికా కెనడాపై మరోసారి టారిఫ్స్‌తో విరుచుకుపడింది.
కెనడాలోని ఒంటారియో ప్రావిన్సు అమెరికాలోకి వచ్చే విద్యుత్‌ప 25 శాతం సుంకాన్ని విధించింది. దీనికి ప్రతిస్పందనగా, ట్రంప్ కెనడా నుంచి అమెరికాకు వచ్చే అన్ని ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై సుంకాన్ని రెట్టింపు చేశాడు. దీంతో ఇది 50 శాతానికి చేరుకుంది. ట్రూత్ సోషల్‌లో ఒక పోస్ట్‌లో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, బుధవారం ఉదయం నుండి అమల్లోకి వచ్చే ఉత్పత్తులపై అదనంగా 25% సుంకాన్ని జోడించాలని తన వాణిజ్య కార్యదర్శిని ఆదేశించానని చెప్పారు.
‘‘అలాగే, కెనడా వెంటనే వివిధ యూఎస్ పాల ఉత్పత్తులపై 250 శాతం నుంచి 390 శాతం వరకు ఉన్న అమెరికన్ రైతు వ్యతిరేక సుంకాలను తగ్గించాలి. ఇది చాలా కాలంగా దారుణంగా పరిగణించబడుతుంది. తమను బెదిరిస్తున్న ప్రాంతంలో విద్యుత్‌పై జాతీయ అత్యవసర పరస్థితిని ప్రకటిస్తా’’ అని డోనాల్డ్ ట్రంప్ అన్నారు. దీర్ఘకాలిక సుంకాలను కెనడా కూడా తగ్గించకపోతే, ఏప్రిల్ 2న అమెరికాలోకి వచ్చే కార్లపై సుంకాలను గణనీయంగా పెంచుతానని ట్రంప్ బెదిరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com