Trump: ఇరాన్‌కు మళ్లీ ట్రంప్ హెచ్చరిక

Trump: ఇరాన్‌కు మళ్లీ ట్రంప్ హెచ్చరిక
X
అణ్వాయుధాల ప్రస్తావన మరిచిపోవాలని వార్నింగ్

ఇరాన్‌ను మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అణ్వాయుధాల ప్రస్తావన ఇరాన్ మరిచిపోవాలని.. లేదంటే అణు స్థావరాలపై మిలిటరీ చర్య ఉంటుందని హెచ్చరించారు. న్యూక్లియర్ ఒప్పందం చాలా దగ్గరకు వచ్చినప్పటికీ ఇరాన్‌ కావాలనే తాత్సారం చేస్తోందని ఆరోపించారు. ఇరాన్ కావాలనే మోసం చేస్తోందని అనుకుంటున్నట్లు ట్రంప్ వ్యాఖ్యానించారు.

అణు ఒప్పందంపై శనివారం ఒమన్‌లో ఇరాన్-అమెరికా మధ్య చర్చలు జరిగాయి. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్.. ఇరాన్ అధికారిని కలిశారు. వారిద్దరి మధ్య చర్చల తర్వాత ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ.. ఇరాన్.. అమెరికాను తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నట్లుగా కనిపిస్తుందన్నారు. ఇరాన్ దగ్గర అణ్వాయుధం ఉండకూడదు.. ఆ ఆలోచనను విరమించుకోవాలని ట్రంప్ పేర్కొ్న్నారు. ఒకవేళ అమెరికాతో ఒప్పందం చేసుకోకపోతే మాత్రం టెహ్రాన్ అణు కేంద్రాలపై సైనిక దాడి జరుగుతుందని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.

ఇదిలా ఉంటే శనివారం ఇరాన్-అమెరికా మధ్య ఒమన్‌లో అణు ఒప్పందంపై చర్చలు జరిగాయి. ఈ చర్చలు సానుకూల మరియు నిర్మాణాత్మక చర్చలు జరిగాయని ప్రకటించాయి. రెండో దశ చర్చలు శనివారం రోమ్‌లో జరగనున్నాయి. ఇదిలా ఉంటే అమెరికాతో రెండో దఫా చర్చలకు ముందు మిత్రదేశాలైన రష్యా, చైనాను ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి సందర్శించనున్నారు.

మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పదవీకాలంలో అమెరికా-ఇరాన్ మధ్య పరోక్ష చర్చలు జరిగాయి. కానీ చర్చలు పురోగతి సాధించలేదు. ఒబామా కాలంలో మాత్రం చర్చలు ఫలించాయి. 2015లో రెండు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చలు జరిగాయి. అనంతరం ట్రంప్ అధికారంలోకి రాగానే ఆ ఒప్పందాన్ని రద్దు చేశారు. తాజాగా మరోసారి ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ ఒత్తిడి తెస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్ తాత్సారం చేస్తోంది.

Tags

Next Story