Elections Polls: బైడెన్‌ కంటే ట్రంప్‌ బెటర్‌!

Elections Polls: బైడెన్‌ కంటే ట్రంప్‌ బెటర్‌!
బైడెన్‌ వెనుకంజ.. తాజా సర్వే ఏం చెప్పిందంటే..?

2024 నవంబరులో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి తాజాగా నిర్వహించిన పోల్‌లో ప్రస్తుత అధ్యక్షుడు బైడెన వెనకబడ్డారు. డొనాల్డ్‌ ట్రంప్‌తో పోల్చితే బైడెన్‌ 10 పాయింట్లవరకూ వెనకబడినట్లు. వాషింగ్టన్ పోస్ట్‌, ABC న్యూస్ సంయుక్తంగా నిర్వహించిన పోల్‌ వెల్లడించింది. 51-42 తేడాతో బైడెన్‌ కంటే ట్రంప్‌ ముందున్నట్లు ఆ పోల్ పేర్కొంది. రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి రేసులో మిగిలినవారి కంటే ట్రంప్‌ ఆధిక్యంలో ఉన్నారు. రిపబ్లికన్‌ పార్టీ అధికారిక నామినేషన్‌ ప్రక్రియ అయోవా కాకస్‌, న్యూహాంప్‌ షైర్‌ ప్రైమరీతో జనవరిలో మొదలుకానుంది. ట్రంప్‌తో పాటు రిపబ్లికన్‌ పార్టీ నుంచి పోటీచేసేందుకు భారత సంతతికి చెందిన నిక్కీహేలీ, వివేక్ రామస్వామి ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల వారికి ఆదరణ పెరిగినప్పటికీ ట్రంప్‌ వారికంటే చాలా ముందున్నట్లు సమాచారం. ఆయనే రిపబ్లికన్ పార్టీ అధికారిక అధ్యక్ష అభ్యర్థి అవుతారని రాజకీయపండితులు అంచనా వేస్తున్నారు.


వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇప్పటి నుంచే ఆ సందడి, హడావుడి కనిపిస్తోంది. ఈ సారి జో బైడెన్‌కి పోటీగా ఇద్దరు రంగంలోకి దిగారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి కూడా పోటీలో ఉన్నారు. "గెలిచేది నేనే" అని ప్రచారం చేసుకుంటున్న ట్రంప్‌కి సర్వేలు అనుకూలంగా ఉండడం ఆసక్తికరంగా మారింది. ABC News, Washington Post చేపట్టిన సర్వేలో బైడెన్ కన్నా ట్రంప్‌కే ఎక్కువ మార్కులు పడ్డాయి. గతంలో ఇదే సర్వేలో బైడెన్‌కి 19 పాయింట్లు తక్కువగా వచ్చాయి. మరోసారి ఈ మధ్య సర్వే నిర్వహించగా బైడెన్ కన్నా 10 పాయింట్‌లు ఎక్కువగా సంపాదించుకున్నారు ట్రంప్. బైడెన్ అమెరికా ఎకానమీని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారని, వలసలనూ ఆపలేకపోయారన్న అసహనం ఓటర్లలో కనిపించినట్టు సర్వే స్పష్టం చేసింది. ఈ సర్వేలో 44% మంది అమెరికా పౌరులు బైడెన్ హయాంలో తమ ఆర్థిక స్థితి బాగా పడిపోయిందని చెప్పారు. ఎకానమీ విషయానికొస్తే కేవలం 30% మంది పౌరులు మాత్రమే బైడెన్‌కి అనుకూలంగా ఓటు వేశారు. అమెరికా-మెక్సికో సరిహద్దు వివాదం, వలసల విషయంలో కేవలం 23% మంది మాత్రమే బైడెన్‌కి మంచి మార్కులు ఇచ్చారు. ఓవరాల్‌గా చూసుకుంటే బైడెన్ పని తీరుకి 37% ఓట్లు పడ్డాయి. 56% మంది వ్యతిరేకించారు. ఆయన వయసు గురించీ ఈ సర్వేలో చాలా మంది ప్రజలు చర్చించారు. వయోభారంతో దేశాన్ని ఎలా నడుపుతారంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. రెండోసారి ఆయన అధికారంలోకి వచ్చే అవకాశాలు తక్కువే అని చెప్పారని సర్వే వెల్లడించింది.



Tags

Read MoreRead Less
Next Story