Trump Jr: ప్రియురాలు ఆండర్సన్‌తో ట్రంప్ జూనియర్ నిశ్చితార్థం

Trump Jr: ప్రియురాలు ఆండర్సన్‌తో ట్రంప్ జూనియర్ నిశ్చితార్థం
X
వైట్‌హౌస్ హాలిడే పార్టీలో ఎంగేజ్‌మెంట్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు ట్రంప్ జూనియర్.. ప్రియురాలు బెట్టినా ఆండర్సన్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు. వైట్‌హౌస్ హాలిడే పార్టీలో ఈ నిశ్చితార్థం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి ట్రంప్, ప్రభుత్వాధికారులు, ఇతర నేతలు పాల్గొన్నారు. కొత్త జంటను పొడియం దగ్గరకు పిలిచి ట్రంప్ అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ట్రంప్ జూనియర్ నిశ్చితార్థం చేసుకోవడం ఇది మూడోసారి. మొదట మాజీ మోడల్, నటి వెనెస్సాను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఐదుగురు సంతానం. 2018లో వెనెస్సా విడాకులకు దరఖాస్తు చేసుకుంది. తర్వాత యూఎస్ టెలివిజన్ ప్రముఖురాలు కింబర్లీ గిల్‌ఫోయిల్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా ఆండర్సన్‌తో దాదాపు ఏడాది నుంచి డేటింగ్‌లో ఉన్నారని తెలుస్తోంది. గత నెలలో భారత్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన వివాహ వేడుకలో కూడా ఈ జంట సందడి చేసింది. తాజ్‌మహల్, అనంత్ అంబానీకి చెందిన ఫారెస్ట్‌ను సందర్శించారు. ఈ వివాహ వేడుకలో డ్యాన్స్‌తో కూడా సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.

బెట్టినా ఆండర్సన్‌ బ్యాగ్రౌండ్

ట్రంప్ జూనియర్‌కు కాబోయే భార్య బెట్టినా ఆండర్సన్.. హ్యారీ లాయ్ ఆండర్సన్-ఇంగర్ ఆండర్సన్‌ల కుమార్తె. హ్యారీ అమెరికాలో బ్యాంక్ అధ్యక్షుడు. 26 ఏళ్ల వయసులో వర్త్ అవెన్యూ నేషనల్ బ్యాంక్‌కు నాయకత్వం వహించారు. బెట్టినా ఆండర్సన్ ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో పెరిగింది. 1986, డిసెంబర్‌లో జన్మించింది. బెట్టినాకు ఐదుగురు తోబుట్టువులు ఉన్నారు. బెట్టినా 2009లో కొలంబియా యూనివర్సిటీ నుంచి పట్టభద్రురాలైంది. వృత్తి రీత్యా మోడల్‌.

Tags

Next Story